Periods Pain: క్షణాల్లో పీరియడ్స్ పెయిన్‌ను మాయం చేసే బెస్ట్ హోమ్ రెమిడీస్!

మహిళల్లో నెలసరి కామనే అయినా.. అది వస్తుంది అంటే మాత్రం చాలా మందికి భయంగా ఉంటుంది. పీరియడ్స్ అనేవి అందరి లేడీస్‌లో ఒకేలా ఉండదు. కడుపులో నొప్పి, నడుం నొప్పి, వాంతులు, వికారం, నీరసం, హెవీ బ్లీడింగ్, ఎక్కువగా నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. ప్రతి నెలా ఇదొక పెద్ద సమస్యగా మారుతుంది. ఇది సాధారణంగా ఉండేదే కదా అని లైట్ తీసుకుంటే.. డైలీ రొటీన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే నెలసరి సమయంలో చాలా మందికి వచ్చే ప్రాబ్లమ్..

Periods Pain: క్షణాల్లో పీరియడ్స్ పెయిన్‌ను మాయం చేసే బెస్ట్ హోమ్ రెమిడీస్!
Periods

Updated on: Feb 17, 2024 | 12:37 PM

మహిళల్లో నెలసరి కామనే అయినా.. అది వస్తుంది అంటే మాత్రం చాలా మందికి భయంగా ఉంటుంది. పీరియడ్స్ అనేవి అందరి లేడీస్‌లో ఒకేలా ఉండదు. కడుపులో నొప్పి, నడుం నొప్పి, వాంతులు, వికారం, నీరసం, హెవీ బ్లీడింగ్, ఎక్కువగా నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. ప్రతి నెలా ఇదొక పెద్ద సమస్యగా మారుతుంది. ఇది సాధారణంగా ఉండేదే కదా అని లైట్ తీసుకుంటే.. డైలీ రొటీన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే నెలసరి సమయంలో చాలా మందికి వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే.. నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొన్ని హోమ్‌మేడ్ రెమిడీస్‌తో ఈ నొప్పికి చెక్ పెట్టొచ్చు. తక్షణమే మీరు రిలీఫ్ పొందవచ్చు.

అల్లం టీ:

పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా వచ్చే వారు.. అల్లం టీ తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అల్లం టీ తాగడం వల్ల తక్షణమే నొప్పి నుంచి రిలీఫ్‌నెస్ పొందుతారట. ఎందుకంటే అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తిమ్మిరిని, పెయిన్‌ని తగ్గిస్తుంది.

పసుపు పాలు:

పసుపు పాలు కూడా పీరియడ్స్ నొప్పిని తగ్గించుకునేందుకు సహాయ పడుతుంది. పసుపులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. అంతే కాకుండా ఇది తిమ్మిరిని కూడా తగ్గిస్తుంది. కడుపులో చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. గోరు వెచ్చటి పసుపు పాలు తాగితే చక్కటి నిద్ర కూడా పడుతుంది.

ఇవి కూడా చదవండి

సోంపు తినండి:

నెలసరిలో వచ్చే నొప్పిని తగ్గించడంలో సోంపు గింజలు కూడా బాగా పని చేస్తాయి. గోరు వెచ్చటి నీళ్లల్లో సోంపును కలుపుని తాగవచ్చు. నేరుగా సోంపును నమిలి తినవచ్చు. లేదా సోంపుతో తయారు చేసిన టీ కూడా తాగినా మంచి ఉపశమనం లభిస్తుంది.

పుదీనా:

పుదీనాలో కూడా శరీరాన్ని చల్లబరితే తత్వం కలిగి ఉంటుంది. ఇది కండరాలకు రిలాక్సేషన్‌ను అందిస్తుంది. కాబట్టి నెలసరి నొప్పి వచ్చేవారు పుదీనా టీ లేదా పుదీనాతో చేసిన డ్రింక్ తాగవచ్చు. లేదా పుదీనా తిన్నా మంచి ఫలితం ఉంటుంది.

అవిసె గింజలు:

అవిసె గింజల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభ్యమవుతాయి. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా హార్మోనల్ అసమతుల్యత, ఇన్ ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తాయి. నెలసరిలో నొప్పి అనిపించినప్పుడు అవిసె గింజల పొడిని ఏదైనా స్మూతీలు, ఓట్మీల్‌లో కలుపుకుని తాగితే ఉపశమనం దొరకుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.