వర్షాకాలంలో మాత్రమే దోమల బెడద ఎక్కువగా ఉంటుందని అనుకుంటే పొరపాటే.. వేసవి కాలంలో కూడా దోమలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువగా రాత్రిపూట దాడి చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఈ దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వస్తాయి. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దోమల నుండి రక్షించుకోవడం, అలాగే వాటి ద్వారా కలిగే వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి సందర్భాల్లో కొందరు దోమల నివారణ మందులను వాడినా ఫలితం పెద్దగా కనిపించదు. బదులుగా, కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి దోమలను సులభంగా తరిమికొట్టవచ్చు.
ఇంట్లోనే సహజసిద్ధమైన ఉత్పత్తుల సహాయంతో దోమలను మీ ఇంటి నుంచి దూరంగా తరిమి కొట్టవచ్చునని మీకు తెలుసా..? అవును, మనం ఉపయోగించే రోజువారీ కొన్ని పదార్థాలను ఉపయోగించి దోమల బెడదను వదిలించుకోవచ్చు..ఇందుకోసం ముందుగా మీరు కొన్ని పండిన నిమ్మకాయలు కొనండి. తర్వాత కొన్ని లవంగాలు, ఆవాల నూనె, దూది లేదా దీపపు వత్తి, కొన్ని కర్పూరం బిళ్లలను తీసుకోండి. తర్వాత నిమ్మకాయలను ఒకవైపుగా కాస్త తొక్క తీసేసి రసం పిండేయాలి. రసం పిండే క్రమంలో నిమ్మకాయ విరిగిపోకుండా జాగ్రత్తవహించాలి. తర్వాత ఆ నిమ్మకాయలో కొంచెం ఆవాల నూనె పోయాలి.
అలాగే, ఆ నిమ్మకాయకు చుట్టూరా లవంగాలను గుచ్చాలి. అందులోనే కర్పూరం బిళ్లలను కూడా వేయండి.. ఆ తర్వాత ఆవాల నూనెలో వత్తివేసి దీపంలా వెలిగించాలి. ఈ విధానాన్ని అనుసరించి ఇంట్లో నిమ్మకాయ దీపం వెలిగించి తలుపులు మూయండి. ఇలా చేయడం వల్ల దోమల బెడద చాలా వరకు తగ్గుతుంది.
ముఖ్యంగా రాత్రిపూట దోమల దాడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలను ప్రయత్నించండి. మీరు కోరుకున్న ఫలితం ఉంటుంది. అంతే కాకుండా నిమ్మకాయను సగానికి కోసి ఒక్కో సగానికి కొన్ని లవంగాలు వేసి ఇంట్లో అక్కడక్కడ పెడితే కూడా దోమలు తగ్గుతాయి. లేకపోతే, లవంగం నూనెను ఒంటికి అప్లై చేసుకోవటం వల్ల కూడా దోమల దాడి నుండి బయటపడొచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..