చలికాలంలో ఆవిరి పడుతున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

శీతాకాలంలో జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఆవిరి పీల్చడం అద్భుతమైన మార్గం. ఇది ముక్కు దిబ్బడను, ఛాతీలో కఫాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తలనొప్పిని తగ్గించి, నిద్రను ప్రోత్సహిస్తుంది. సరైన పద్ధతిలో ఆవిరి పీల్చడం వల్ల శీతాకాలపు అనారోగ్యాల నుండి ఉపశమనం పొందవచ్చు.

చలికాలంలో ఆవిరి పడుతున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Winter Steam Therapy

Updated on: Dec 17, 2025 | 3:24 PM

శీతాకాలం చల్లటి వాతావరణం కారణంగా జలుబు, దగ్గుతో పాటు అనేక అనారోగ్యాలను తెస్తుంది. ముఖ్యంగా మీ శరీరం సున్నితంగా ఉండి, మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఈ కాలానుగుణ వ్యాధుల ప్రమాదం మరింతగా పెరుగుతుంది. శీతాకాలంలో చాలా మంది దగ్గు, జలుబుతో బాధపడుతుంటారు. వీటి నుండి ఉపశమనం పొందడానికి సులభమైన మార్గం వేడి నీటి ఆవిరి పీల్చుకోవడం. ఇది జలుబు, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తగ్గించడమే కాకుండా, ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. శీతాకాలంలో ఆవిరి పీల్చడం వల్ల కలిగే ప్రయోజనాలు, అది ఎంతసేపు చేస్తే మంచిది.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

ముఖాన్ని లోతుగా శుభ్రపరచడానికి స్టీమింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. స్టీమింగ్ చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన మురికి, ధూళిని తొలగిస్తుంది. ఇంకా, ఈ పద్ధతి బ్లాక్ హెడ్స్ తొలగించడానికి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

శీతాకాలంలో ఆవిరి పట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. కండరాలను సడలించడానికి ఆవిరి పట్టడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

మీరు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటే క్రమం తప్పకుండా ఆవిరి పట్టుకోవచ్చు. ఈ ఆవిరి నీటిలో గంధపు నూనె, లావెండర్ నూనెను కూడా యాడ్‌ చేసుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

శీతాకాలంలో జలుబు, దగ్గు ఒక సాధారణ సమస్య. దీని నుండి ఉపశమనం పొందడానికి ఆవిరి పట్టుకోవడం మేలు. ఆవిరి పట్టడం వల్ల ఫ్లూ, ముక్కు దిబ్బడ లక్షణాలను తొలగి పోతాయి.ఆవిరి పీల్చడం వల్ల వాయుమార్గాలను తెరవడానికి సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది.

ఆవిరిని ఎలా, ఎంతసేపు తీసుకోవాలి..?

ఆవిరి పట్టుకోవడం కోసం ముందుగా నీటిని మరిగించుకోండి. బాగా మరిగిన నీటిని జాగ్రత్తగా ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత, ఆవిరి బయటకు రాకుండా ఒక బెడ్‌షీట్‌ వంటిది తీసుకుని నిండుగా కప్పేసుకోండి. మీ కళ్ళు మూసుకుని నెమ్మదిగా మీ తలను నీటిపైకి వంచి, నీటి నుండి దాదాపు 8 నుండి 12 అంగుళాల దూరం ఉంటూ… నీటిని తాకకుండా జాగ్రత్త వహించండి. మీ ముక్కు ద్వారా నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోండి. మీరు దీన్ని 2 నుండి 5 నిమిషాలు చేయవచ్చు. అయితే వేడి నీళ్లకి మీ ముఖాన్ని కాస్త దూరంగా పెట్టండి లేదంటే వేడి నీళ్ల వల్ల మీ ముఖం కాలిపోయే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..