Figs: నానబెట్టిన అంజీర్‌తో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..!

హైబీపీని కంట్రోల్ చేయడానికి అంజీర్‌ను తీసుకోవడం మంచిది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. చర్మ సమస్యలను నయం చేసి చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంజీర్‌ను తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే యాక్టివ్‌గా కూడా రోజంతా ఉండడానికి సహాయం చేస్తుంది.

Figs: నానబెట్టిన అంజీర్‌తో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..!
Figs Health Benefits

Updated on: Jul 16, 2025 | 10:16 PM

అంజీర్‌ పండులో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా దీర్ఘకాలిక మలబద్దక సమస్యకు కూడా ఇది ఎఫెక్టీవ్‌ రెమిడీ. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు నానబెట్టిన అంజీర్‌ తినండి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి పోషకాలు రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది షుగర్‌ వ్యాధిగ్రస్థుకు మంచిది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది ఎముకలకు బలం.

నానబెట్టిన అంజీర్‌ను చిన్నారులకు పెట్టడం వల్ల పిల్లలకి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. గర్భిణీలు కూడా వీటిని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం నుంచి బయట పడతారని నిపుణులు చెబుతున్నారు. అంజీర్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్ వంటివి ఇందులో పుష్కలంగా ఉంటాయి.ఇవి కండరాలను బలంగా మార్చుతాయి. అంజీర్ తీసుకోవడం వల్ల ఫైబర్ బాగా ఎక్కువగా ఉంటుంది. పేగులకి మంచిది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.

ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి అంజీర్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్న వాళ్లు అంజీర్‌ తీసుకోవడం మంచిది. పొటాషియం ఇందులో ఎక్కువ మోతాదులో ఉంటుంది. హైబీపీని కంట్రోల్ చేయడానికి అంజీర్‌ను తీసుకోవడం మంచిది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. చర్మ సమస్యలను నయం చేసి చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంజీర్‌ను తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే యాక్టివ్‌గా కూడా రోజంతా ఉండడానికి సహాయం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..