రాగిజావలో ఈ గింజలు నానబెట్టుకుని తాగితే.. మీ బొక్కలు ఉక్కులా మారుతాయ్..!

రోజూ రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద, పోషకాహార నిపుణులు తరచూగా చెబుతుంటారు. వివిధ సమస్యలతో బాధపడేవారు కూడా ఎలాంటి సందేహం, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా రాగి జావ తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని పొందుతారని అంటున్నారు. ఎందుకంటే రాగి జావ అద్భుతమైన పోషకాహారం. దీనిలో విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్‌ల వంటి అన్ని అవసరమైన స్థూలపోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, రాగి జావలో కొన్ని గింజలు నానబెట్టి తీసుకోవటం వల్ల రెట్టింపు ఫలితాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

రాగిజావలో ఈ గింజలు నానబెట్టుకుని తాగితే.. మీ బొక్కలు ఉక్కులా మారుతాయ్..!
Fenugreek In Ragi Porridge

Updated on: Nov 03, 2025 | 7:52 PM

రాగి జావలో మెంతులు నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఏ,బీ6, సీ, కే తదితర పోషకాలు ఉంటాయి. మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రాగిలో ఉన్న ఫైబర్ గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. రాగి జావలో మెంతులు నానబెట్టుకుని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రాగిలో ఉన్న ఐరన్, మెంతులోని ఫోలేట్ కలిసి హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. రక్తహీనత సమస్యలు తగ్గుతాయి.

మెంతుల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రాగి జావలో మెంతులు కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. వీటిని ఇలా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రాగిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకుల ఆరోగ్యానికి మంచిది.

మెంతులు మహిళలలో హార్మోన్ల బ్యాలెన్స్డ్ గా ఉంచుతాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తాయి. రాగి, మెంతుల్లోని యాంటీఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. క్రమం తప్పకుండా రాగిజావ మెంతులు తీసుకుంటే మంచిది. రాగి, మెంతులలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటం వల్ల శరీరానికి రక్షణ శక్తిని అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే రాగి జావలో మెంతులు నానబెట్టుకుని తాగడం వల్ల శరీరా చల్లదనాన్ని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..