AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిస్‌మిస్‌ని ఇలా నీళ్లల్లో నానబెట్టి తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే…

ఎండుద్రాక్ష దీనినే కిస్మిస్‌ అని కూడా పిలుస్తారు.. ఈ కిస్మిస్‌తో లెక్కకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, వీటిని సరైన సమయంలో సరైన విధానంలో తింటేనే అనుకున్న లాభాలు పొందుతారు. ఇందుకోసం కిస్మిస్‌లను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే అద్భుతమైన లాభాలున్నాయి. అవేంటో తెలిస్తే ఈ రోజు నుండి మొదలుపెడతారు..

కిస్‌మిస్‌ని ఇలా నీళ్లల్లో నానబెట్టి తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే...
Raisin Water
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2025 | 2:05 PM

Share

కిస్మిస్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ చాలామందికి ఎనర్జీ తక్కువగా ఉండి నీరసంగా అన్పిస్తుంటుంది. ఈ సమయంలో కిస్మిస్ తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇందులో నేచురల్ స్వీట్ ఉంటుంది. నానబెట్టిన కిస్మిస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.శరీరానికి పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు కిస్మిస్‌తో లభిస్తాయి.

కిస్మిస్‌లో పోలీఫెనోల్, ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నాశనం చేస్తాయి. స్వెల్లింగ్ తగ్గిస్తుంది. సూక్ష్మ క్రిములు వృద్ధి చెందకుండా కాపాడుతాయి. గుండె వ్యాధులు, కేన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కిస్మిస్ తినాల్సిన సరైన సమయం కిస్మిస్ తినే సరైన సమయం ఉదయం వేళ. రక్తహీనత దూరం చేస్తుంది. నానబెట్టిన కిస్మిస్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. తద్వారా రక్తహీనత ఏర్పడకుండా కాపాడుకోవచ్చు.

నానబెట్టిన కిస్మిస్‌లోని ఫ్రక్టోస్, గ్లూకోజ్ మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తింటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. నానబెట్టిన కిస్మిస్‌లో ఓలినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతక్షయం ఏర్పడకుండా నివారిస్తుందని చెబుతారు. తద్వారా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నానబెట్టిన కిస్మిస్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బాడీలో సోడియం లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. నానబెట్టిన కిస్మిస్‌లో బోరాన్, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల బలానికి సహాయపడతాయి. తద్వారా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, పరిష్కారాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. మేము వాటిని నిర్దారించడం లేదు. వాటిని స్వీకరించే ముందు ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
16 ఏళ్లకే హీరోయిన్..మూడో చిత్రంతోనే సంచలనం..
16 ఏళ్లకే హీరోయిన్..మూడో చిత్రంతోనే సంచలనం..
హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా పవర్‌ఫుల్ హెలికాప్టర్!
హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా పవర్‌ఫుల్ హెలికాప్టర్!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ఇదే..!
తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..!
తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..!
విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ 'యాష్ ట్రే' ఎందుకు?
విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ 'యాష్ ట్రే' ఎందుకు?
ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా!
ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా!
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి