ఖాళీ కడుపుతో ఉలవల నీటిని తాగితే అద్భుతమైన బెనిఫిట్స్‌..! తప్పక ట్రై చేయండి.. త్వరలోనే మార్పును గమనిస్తారు…

ఉలవలతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి జ్వరం, దగ్గు, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, మలబద్ధకం, కీళ్ళ నొప్పులు మరెన్నో సమస్యలను తగ్గించే గుణం ఉలవలకు ఉంటుంది. అంతేకాదు.. ఉలవల్లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అనేక అనారోగ్య సమస్యల నివారణలో దోహదపడతాయి. అయితే, ఉలవలు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఏమౌతుందో తెలుసా..?

ఖాళీ కడుపుతో ఉలవల నీటిని తాగితే అద్భుతమైన బెనిఫిట్స్‌..! తప్పక ట్రై చేయండి.. త్వరలోనే మార్పును గమనిస్తారు...
Horse Gram Water

Updated on: Aug 29, 2025 | 9:15 PM

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తరచుగా వైద్యులు చెప్పే మాట ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాలు తీసుకోవాలని సలహా ఇస్తారు. ఈ ఆరోగ్యకరమైన వాటిలో ఉలవలు కూడా ఉన్నాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ఉలవల నీరు తాగడం వల్ల శరీరానికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయా ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉలవల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, భాస్వరం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్, విటమిన్-బి కాంప్లెక్స్, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉలవల నీటిని తాగితే అది శరీరంలోని రక్తహీనతను నయం చేస్తుంది. ఇందులో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను నయం చేస్తుంది.

ఉలవలు నానబెట్టిన నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ కడుపు సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో కడుపు శుభ్రంగా ఉంటుంది. అంతేకాదు.. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఉలవల నీటిని తాగవచ్చు. ఈ నీటిలో పొటాషియం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బలహీనమైన ఎముకల సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో ఉలవల నీటిని చేర్చుకోవాలి. ఇందులో ఉండే కాల్షియం ఎముకలకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఉలవల నీరు తాగేటప్పుడు, ఎక్కువగా తాగకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈ నీటిని ఎక్కువగా తాగడం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. ఈ నీటిని పరిమితుల్లోనే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.