Hair Care: రోజూ ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగారంటే.. ఒత్తైన పొడవాటి కురులు మీ సొంతం!

|

Feb 28, 2025 | 12:59 PM

బీట్‌రూట్ పేరు వింటేనే చాలా మంది ముఖం చిట్లిస్తారు. నిజానికి, బీట్‌రూట్ చాలా పోషకమైన కూరగాయ. ఇందులో ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన తల చర్మం ఆరోగ్యంగా మారి, జుట్టు తగినన్ని పోషకాలను అందిస్తుంది. అందుకే ఒత్తైన జుట్టు కోసం బీట్‌రూట్‌ తినాలని చెబుతున్నారు నిపుణులు..

Hair Care: రోజూ ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగారంటే.. ఒత్తైన పొడవాటి కురులు మీ సొంతం!
Beetroot For Hair Care
Follow us on

పొడవాటి, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు పెరగదు.. బదులుగా జుట్టు రాలడం అధికమవుతుంది. మరికొంతమంది మార్కెట్లో లభించే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. ఇవి తాల్కాలిక ఉపశమనం కలిగించినా పరిస్థితిలో మార్పుకానరాదు. కానీ మీకు తెలుసా.. బీట్‌రూట్ జుట్టు సంరక్షణలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ బీట్‌రూట్‌ను ఈ కింది విధంగా తీసుకోవడం ద్వారా ఒత్తైన పొడవాటి జుట్టును పొందవచ్చు. ఎలాగంటే..

జుట్టు ఆరోగ్యానికి బీట్‌రూట్ ఎలా సహాయపడుతుందంటే?

విటమిన్ సి

విటమిన్ సిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బీట్‌రూట్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీసే, జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. విటమిన్ సి జుట్టు ఆరోగ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

మెగ్నీషియం – భాస్వరం

ఈ రెండు ఖనిజాలు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

ఇవి కూడా చదవండి

పొటాషియం

బీట్‌రూట్‌లోని పొటాషియం తలకు పోషణను అందించడంలో, జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

ఐరన్

రక్త ప్రసరణకు ఐరన్ చాలా అవసరం. ఇది తలకు అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కేశ సంరక్షణ, జుట్టు పెరుగుదల కోసం ఐరన్‌ చాలా అవసరం. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఫోలిక్ యాసిడ్

ఫోలిక్ యాసిడ్ జుట్టు కుదుళ్ల పునరుత్పత్తికి సహాయపడుతుంది. దట్టమైన పొడవైన జుట్టు పెరుగుదలకు ఇది సహాయపడుతుంది.

బీటైన్లు

బీట్‌రూట్‌లోని బీటైన్లు జుట్టు కుదుళ్లను హైడ్రేట్ చేయడానికి, రక్షించడానికి సహాయపడతాయి. ఇది జుట్టుకు సహజమైన మెరుపును ఇవ్వడమే కాకుండా మృదువుగా కూడా చేస్తుంది.

బీట్‌రూట్ ఎప్పుడు, ఎలా తీసుకోవాలి?

బీట్‌రూట్ జ్యూస్

పొడవాటి జుట్టు కావాలంటే బీట్‌రూట్ జ్యూస్ రోజూ తీసుకోవడం మంచిది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల జుట్టు ఆరోగ్యానికి సహాయపడటమే కాకుండా, శరీరానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్‌ తాగాలి. ఇది పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బీట్‌రూట్ సలాడ్

బీట్‌రూట్‌ ముక్కలతో సలాడ్ తయారు చేసి ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. బీట్‌రూట్ సలాడ్ మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంతో తినవచ్చు. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. జుట్టు, శరీరాన్ని లోపలి నుంచి పోషించడంలో సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.