Beetroot Juice: మహిళల్లో వచ్చే గుండె పోటును ఆపే బీట్ రూట్ జ్యూస్..

|

Jul 05, 2024 | 2:07 PM

బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే జ్యూస్ తాగుతూ ఉంటారు. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల మహిళల్లో వచ్చే గుండె పోటు రాకుండా చేస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. ప్రతి రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ధమనుల ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడమే కాకుండా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ..

Beetroot Juice: మహిళల్లో వచ్చే గుండె పోటును ఆపే బీట్ రూట్ జ్యూస్..
Beetroot Juice
Follow us on

బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే జ్యూస్ తాగుతూ ఉంటారు. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల మహిళల్లో వచ్చే గుండె పోటు రాకుండా చేస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. ప్రతి రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ధమనుల ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడమే కాకుండా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ వెల్లడించింది. ఎందుకంటే బీట్ రూట్ జ్యూస్ నైట్రేట్ మొక్క మూలం. ఇది గుండెలో ధమనులను, సిరలను విస్తరిస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణ జరిగేటప్పుడు గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మహిళల్లో వచ్చే మోనోపాజ్ అనేది గుండె జబ్బులకు ముఖ్యమైన ప్రమాద కారకం.

మోనోపాజ్‌కు గుండె జబ్బులు రావాడానికి సంబంధం ఏంటి?

మోనోపాజ్‌లో ఉన్నప్పుడు శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు అనేవి తగ్గుతాయ. కార్డయప్రొటెక్టివ్ ప్రభావాలు తగ్గడం వల్ల గుండె మీద ఈస్ట్రోజెన్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. ఇవి కాస్తా రక్త నాళాల్లో అడ్డంకులను ఏర్పరుస్తాయి. దీంతో రక్త ప్రసరణ సరిగ్గా జరగక గుండెపై ఒత్తిడి పడుతుంది. దీంతో బీపీ పెరగడం, హార్మోన్లలలో తేడా రావడం, నిద్ర సరిగ్గా పట్టక పోవడంతో గుండెపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు వస్తాయి.

నైట్రేట్ ఏం చేస్తుంది?

బీట్ రూట్‌లో ఉండే నైట్రేట్ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. ఇది రక్త నాళాలను సడలించడం, రక్త ప్రవాహాన్ని సులభంగా జరిగేలా చేస్తుంది. అంతే కాకుండా రక్త పోటును తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

బీట్ రూట్ జ్యూస్ ప్రయోజనాలు:

బీట్ రూట్ జ్యూస్ తాగడ వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ప్రతి రోజూ ఒక చిన్న కప్పు అయినా బీట్ రూట్ జ్యూస్ తాగడానికి ట్రై చేయండి. దీని వల్ల మీ స్కిన్, జుట్టు, శరీర ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. ముఖ్యంగా గుండె, కాలేయం, మూత్ర పిండాలు ఆరోగ్యంగా పని చేస్తాయి. జీర్ణ సమస్యలు, యూరినరీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. చర్మం రంగు మారి, కాంతివంతం అవుతుంది. జుట్టు బలంగా, దృడంగా తయారవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..