Beauty Tips: ముఖంపై ముడతలు పడుతున్నాయా? అయితే, ఈ ఫేస్ ప్యాక్‌లతో చెక్ పెట్టండి..!

|

Mar 20, 2022 | 4:40 PM

Beauty Tips: మహిళలు అయినా, పురుషులు అయినా ఒక వయసు దాటిన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆడవారు 40 ఏళ్లు దాటిన

Beauty Tips: ముఖంపై ముడతలు పడుతున్నాయా? అయితే, ఈ ఫేస్ ప్యాక్‌లతో చెక్ పెట్టండి..!
Beauty Tips
Follow us on

Beauty Tips: మహిళలు అయినా, పురుషులు అయినా ఒక వయసు దాటిన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆడవారు 40 ఏళ్లు దాటిన తరువాత ముఖ చర్మం ముడతలు పడటం మొదలవుతుంది. ఈ సమస్యను నివారించడానికి చాలా మంది ఫేస్‌ ప్యాక్‌లు, తదితర ప్రయోగాలు చేస్తుంటారు. అయితే, రసాయనాలు, కృత్రిమ అందం కాకుండా.. ఇంట్లో మనం రోజూ తినే ఆహార పదార్థాలతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. పప్పులు, ఇతర పదార్థాలతో తయారు చేసిన సహజ ఫేస్ ప్యాక్‌లతో ముడలత బాద నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పప్పు..
వృద్ధాప్య లక్షణాలను తగ్గించే గుణాలు పప్పులో పుష్కలంగా ఉన్నాయని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శనగపిండిలో మసూద్ పప్పు పిండి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిపోయేంత వరకు అది అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత చల్లని నీటితో కడగాలి.

బొప్పాయి ఫేస్ ప్యాక్..
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. బొప్పాయి పండును మెత్తగా పేస్ట్‌లా చేయాలి. ఆ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. బొప్పాయి ప్యాక్ ద్వారా చర్మానికి సహజ మెరుపు లభిస్తుంది.

పసుపు, పెరుగు..
ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే పసుపు ఫేస్ ప్యాక్‌ను తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు పెరుగులో అర టీస్పూన్ పచ్చి పసుపును కలపండి. ముఖంతో పాటు చేతులు, మెడపై కూడా అప్లై చేసుకోవచ్చు. కాసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

దోసకాయ, అలోవెరా..
కొన్నిసార్లు చర్మం డీహైడ్రేట్ అవడం వల్ల కూడా చర్మం ముడతలు పడుతుంటుంది. దోసకాయ, కలబంద రెండూ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. రెండు చెంచాలు తురిమిన దోసకాయ రసాన్ని తీసుకుని దానికి ఒక చెంచా అలోవెరా జెల్ కలపండి. ఈ ప్యాక్‌ను ముఖంపై సుమారు 30 నిమిషాల పాటు ఉంచిన తర్వాత, గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.

అరటిపండు, తేనె..
ఒక గిన్నెలో ఒక చెంచా తేనె తీసుకుని అందులో అరటిపండును మెత్తగా చేయాలి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. దీంతో చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

Also read:

Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!

Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

Viral Video: అమ్మో ‘డైనోసార్’ చేప.. మరీ ఇంత పెద్ద చేపను మీ జీవితంలో చూసుండరు.. షాకింగ్ వీడియో మీకోసం..!