ముఖంపై నల్లని మచ్చలు వికారంగా కనిపిస్తున్నాయా? ఈ సింపుల్ చిట్కాతో మచ్చలేని మోము మీసొంతం చేసుకోండి. ఇంట్లో దొరికే వాటితో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో మీకోసం..
Black Spots On Face
Follow us on
How to get rid of dark spots on the face: ముఖంపై నల్లని మచ్చలు వికారంగా కనిపిస్తున్నాయా? ఈ సింపుల్ చిట్కాతో మచ్చలేని మోము మీసొంతం చేసుకోండి. వంటింట్లో దొరికే ఈ పదర్ధాలతో ఫేస్ ప్యాక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం మీకోసం..
ముందుగా క్యారెట్, నిమ్మకాయ, బంగాళ దుంప ఒక్కోటిగా తీసుకుని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి
తర్వాత ఈ మూడింటిని తొక్క తీయకుండా సన్నగా తురుముకోవాలి
Lemon And Carrots
వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి 24 గంటలపాటు మూతపెట్టి ఉంచాలి
తరువాత గిన్నెలో ఉన్న తురుమును వడగట్టి నీటిని వేరు చేసి ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, వడగట్టి పెట్టుకున్న రసం మూడు టీస్పూన్లు వేసి, కొద్దిగా బాదం నూనెవేసి పేస్టులా కలుపుకోవాలి
చివరిగా ఈ విటమిన్ క్యాప్యూల్స్ ఒకటి వేసి కలిపితే క్రీం రెడీ అయినట్లే.
దీనిని గాజు సీసాలో స్టోర్ చేసుకుని రోజూముఖానికి రాసుకుంటే నల్లని మచ్చలు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి
ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు ముఖానికి రాసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.