Skin Care Tips: వేసవిలో ముఖం అంద విహీనంగా కనిపిస్తోందా? అయితే ఈ నేచురల్ టిప్స్ మీకోసమే..
Summer Skin Care Tips: వాతావరణంలోని మార్పులు చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వేసవిలో విపరీతమైన ఎండ, వేడిమి కారణంగా పలు చర్మ సమస్యలు తలెత్తుతాయి.

Summer Skin Care Tips: వాతావరణంలోని మార్పులు చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వేసవిలో విపరీతమైన ఎండ, వేడిమి కారణంగా పలు చర్మ సమస్యలు తలెత్తుతాయి. చెమటకు తోడు దుమ్ము, ధూళి కారణంగా మొటిమలు, మచ్చలు బాగా ఇబ్బంది పెడతాయి. ముఖం రంగుమారిపోయి అంద విహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది మార్కెట్లలో దొరికే సన్‌స్ర్కీన్ లోషన్లు, వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. ఇవి చర్మానికి ఎంతమేరకు మేలు చేకూరుస్తాయో కచ్చితంగా చెప్పలేం. దీనికి తోడు ఇందులో ఉండే రసాయానాలు ఒక్కోసారి దుష్ర్పభావాలు చూపవచ్చు. అందుకే సహజసిద్ధమైన పద్ధతులనే ఎంచుకోవాలంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
క్లెన్సింగ్
వేసవిలో ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖం కడుక్కోవడం అసలు మర్చిపోవద్దు. జిడ్డు చర్మం ఉన్నవారు ఆయిల్ ఫ్రీ క్లెన్సర్‌తో ముఖాన్ని వాష్ చేసుకోవాలి. దీనివల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, దుమ్ము, ధూళి తొలగిపోతాయి.
స్క్రబ్బింగ్
వాతావరణంలో మార్పుల కారణంగా, గాలిలో ఉండే ధూళి కణాలు చర్మంపై పేరుకుపోతాయి. ముఖాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోతే కొంతకాలానికి అవి మొటిమలు లేదా నల్లటి మచ్చలకు కారణమవుతాయి. ఇందుకోసం చర్మాన్ని స్క్రబ్ చేయడం ఎంతో ముఖ్యం. స్క్రబ్బింగ్ చేయడం వల్ల ముఖంపై మృత కణాలు తొలగిపోయి మెరుపును సంతరించుకుంటుంది.
ఫేస్ ప్యాక్..
స్కిన్ కేర్ రొటీన్ లో వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఉత్తమం. పసుపు, క్రీమ్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మిలమిల మెరుస్తుంది. చర్మ సంరక్షలో పసుపుది కీలక పాత్ర. మొటిమలను తగ్గించడంలోనూ పసుపు సహాయపడితే, చర్మాన్ని తేమగా ఉంచడంలో క్రీమ్ బాగా హెల్ప్ చేస్తుంది.
ఆవిరి
గాలిలోని కాలుష్యం చర్మంపై చెడు ప్రభావం చూపుతుంది. మృతకణాల కారణంగా ముఖం ట్యానింగ్‌కు గురికావచ్చు. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ముఖానికి ఆవిరి పట్టడం ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న చర్మంపై స్వేద గ్రంథులు తెరుచుకుంటాయి. ఫలితంగా మృతకణాలు తొలగిపోయి ముఖం మెరుపును సంతరించుకుంటుంది.
మాయిశ్చరైజింగ్
చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి చాలామంది మాయిశ్చరైజింగ్ క్రీములను వినియోగిస్తుంటారు. అయితే కొద్దికాలం తర్వాత వాటిని పక్కనపెట్టేస్తుంటారు. అయితే సీజన్ ఏదైనా సరే, చర్మంపై మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిందే. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి క్రీమ్ అప్లై చేయాలి.
Also Read:Facebook: ఇకపై మీ దుస్తులు మీరే ఉతుక్కోవాలంటూ ఉద్యోగులకు నోటీసు.. ఫేస్ బుక్ అలా ఎందుకు చేసిందంటే..
Vehicle Sales: ఫిబ్రవరి 2022లో తగ్గిన వాహనాల విక్రయాలు.. దీని ప్రధాన కారణం ఏంటంటే..!
Virat Kohli: అనుకున్నదంతా అయ్యింది.. కేవలం 7 పరుగుల దూరం.. కోహ్లీ ఫ్యాన్స్ గుండె బద్దలు.!