Amla Powder: మొటిమలు, నల్లమచ్చలకు ఉసిరి పొడి దివ్య ఔషధం.. ఎలా వాడాలంటే..?

|

Feb 07, 2022 | 10:51 AM

Amla Powder: ఉసిరికాయ ఆరోగ్యానికే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి అనేక

Amla Powder: మొటిమలు, నల్లమచ్చలకు ఉసిరి పొడి దివ్య ఔషధం.. ఎలా వాడాలంటే..?
Amla Powder
Follow us on

Amla Powder: ఉసిరికాయ ఆరోగ్యానికే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి అనేక విధాలుగా సహాయం చేస్తుంది. దీంతో చర్మంపై ఏర్పడే మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు తగ్గుతాయి. ఇది చర్మాన్ని తేమగా మారుస్తుంది. మొటిమల నుంచి యాంటీ ఏజింగ్ వరకు విటమిన్ సి మన చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఉసిరిని చర్మ సంరక్షణలో అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.

1. పసుపు, ఉసిరి

ఒక టీస్పూన్ ఉసిరి పొడిలో ఒక టీస్పూన్ పసుపు కలపండి. దీంట్లో రోజ్ వాటర్ మిక్స్‌ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి సుమారు 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ముఖం కడుక్కోవడానికి చల్లని నీటిని ఉపయోగించాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు తగ్గుతాయి

2. ఆమ్లా, తేనె

ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ ఉసిరి పొడిని మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ అంతటా అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు వేళ్లతో మృదువుగా మసాజ్ చేయాలి. చర్మంపై 15-20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు.

3. గ్రీన్ టీ, ఆమ్లా

ఆరోగ్యానికి మేలు చేసే గ్రీన్ టీ చర్మ సంరక్షణలో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఉసిరితో మిక్స్ చేయడం వల్ల మరింత ప్రయోజనకరంగా మారుతుంది. దీని కోసం గ్రీన్ టీ ఆకులను నీటిలో మరిగించి చల్లారిన తర్వాత దానికి ఒక చెంచా ఉసిరి పొడిని కలపండి. ఈ పేస్ట్‌ని 15 నిమిషాల పాటు ముఖంపై అప్లై చేసి తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితాలు ఉంటాయి.

Eyes Health: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తప్పనిసరి.. ఏంటో తెలుసుకోండి..?

IND vs WI: విరాట్‌ కోహ్లీ రికార్డ్‌ని బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. ఏ విషయంలో తెలుసా..?

Sleep From Home Job: 8 వారాల పాటు నిద్రపోతే 1.5 లక్షల జీతం.. ఎవరికి అవకాశం లభిస్తుందంటే..?