
సాయంత్రం అయ్యిందంటే చాలు దోమలు విరుచుకుపుడుతున్నాయి. గుయ్యిమంటూ శబ్ధం చేస్తూ రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమకాటుతో డెంగ్యూ, మలేరియా వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే దోమలను తరిమికొట్టేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ముఖ్యంగా రసాయనాలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయతే దీనివల్ల మనుషులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే సహజ పద్ధతుల్లో దోమలను తరిమికొట్టవచ్చు. సాధారణంగా అరటి పండ్లను తిన్న వెంటనే తొక్కలను పడేస్తుంటాం. అయితే వృధా అనుకునే ఈ తొక్కలతో దోమలను తరిమికొట్టవచ్చని మీకు తెలుసా.? ఇంతకీ దోమలను తరిమి కొట్టడానికి అరటి పండ్లు ఎలా ఉపయోగపడతాయనేగా మీ సందేహం. ఇందుకోసం ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు. సాయంత్రం కాగానే దోమలు ఎక్కువగా ఉండే గదిలో నలుగు చివర్లలో అరటి తొక్కలను పెట్టాలి.
అరటి తొక్కల నుంచి వెలువడే ఒకరకమైన వాసన దోమలను తరిమికొడుతుంది. ఈ వాసనకు దోమలు దూరంగా పారిపోతాయి. అరటి తొక్క పేస్ట్ కూడా ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. అరటి తొక్కను మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్టును దోమలు ఎక్కువగా ఉండే ఇంటి మూలల్లో అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా దోమలు బలదూర్ అవుతాయి.
ఇక అరటి తొక్కలను ఎండబెట్టి వాటిని కాల్చడం ద్వారా కూడా దోమల సమస్య తగ్గుతుంది. అరటి తొక్కలను ఎండలో బాగా అరబెట్టాలి. ఆ తర్వాత వాటిని ఒక చిన్న గిన్నెల్‌లో వేసి కాల్చాలి. ఇళ్లంతా పొగను పట్టించాలి. దీంతో సాయంత్రం పూట ఇంట్లో వచ్చే దోమలు పరార్ అవుతాయి. అయితే ఈ పోగను నేరుగా పీల్చుకోకుండా ఉండడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..