Banana Leaf Uses: అరటి ఆకులో ఎందుకు భోజనం చేస్తారో? తెలుసా? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు

మనం అరటి ఆకులోనే ఎందుకు భోజనం చేస్తున్నాం? ఏ టేకు ఆకో లేదా ఇతర ఆకుల్లో ఎందుకు భోజనం చేయడం లేదనే విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? లేకపోతే అస్సలు అరటి ఆకు ఎందుకు వినియోగించాలో తెలుసుకుందాం. 

Banana Leaf Uses: అరటి ఆకులో ఎందుకు భోజనం చేస్తారో? తెలుసా? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు
Banana Tree

Edited By: Anil kumar poka

Updated on: Dec 24, 2022 | 6:30 PM

మనం గతంలొ ఏ శుభకార్యానికి వెళ్లినా  కచ్చితంగా అరటి ఆకులోనే భోజనం పెట్టేవారు. క్రమేపీ ప్లాస్టిక్ వాడకం పెరగడంతో ఆర్టిఫిషియల్ అరటి ఆకుల్లో భోజనం పెడుతున్నారు. ఫంక్షన్ సమయంలో సమయం ముఖ్యం. దీంతో అరటి ఆకు ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉండదని అందరూ ప్లాస్టిక్ ఆకులపై మక్కువ చూపించారు. అయితే మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అసలు మనం అరటి ఆకులోనే ఎందుకు భోజనం చేస్తున్నాం? ఏ టేకు ఆకో లేదా ఇతర ఆకుల్లో ఎందుకు భోజనం చేయడం లేదనే విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? లేకపోతే అస్సలు అరటి ఆకు ఎందుకు వినియోగించాలో తెలుసుకుందాం. 

సాధారణంగా పెళ్లిళ్ల సమయంలో ఇంటి గుమ్మానికి అరటి చెట్టును అందంగా అలంకరిస్తారు. చాలా మంది పచ్చదనం శుభప్రదం అందుకే ఇలా పూర్వికులు ఇలా అలంకరించేవారు అనుకునే వారు. కానీ అందులో కూడా ఓ సైన్స్ దాగొని ఉంది. అరటి చెట్టు గుమ్మానికి కట్టడం వల్ల ఎలాంటి గాలి ద్వారా వైరస్, బ్యాక్టీరియాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే అరటి ఆకుల్లో బోజనం చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే అరటి ఆకుల్లో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు అధకంగా ఉంటాయి. వీటిపై భోజనం చేస్తే ఎలాంటి క్రిములు ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరవు. అందువల్లే అరటి ఆకులో భోజనం చేయడమే మేలని పెద్దలు చెబుతారు. 

అరటికాయతో ఇన్ని అద్భుతాలా? 

చాలా మంది అరటి కాయతో వంటలు అంటే ముఖం చిట్లిస్తారు. అయితే అది చాలా తప్పని అరటి కాయ ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటికాయలో విటమిన్ బి, విటమిన్ సీ, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. పచ్చి అరటికాయలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడవచ్చు. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి రోజూ ఓ అరటికాయ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అరటి కాయ తింటే రక్త హీనత తగ్గి మెదడు చురుగ్గా పని చేస్తుందని నిపుణులు అభిప్రాయం. ఈ అరటి కాయలను కూర చేసుకుని తిన్నా లేదా ఉడికించి తిన్నా అద్భుత ప్రయోజనాలున్నాయని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ ‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..