Banana Hair Mask: అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..!

|

Jan 07, 2025 | 8:05 AM

అరటిపండులోని నూనెలు జుట్టును లోతుగా మాయిశ్చరైజ్ చేస్తాయి. తద్వారా వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టం నుండి జుట్టును కాపాడుతుంది. అరటిపండులోని పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అరటిపండు జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అరటిపండులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గిస్తాయి. ఇన్నీ ప్రయోజనాలు కలిగిన అరటి హెయిర్‌ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

Banana Hair Mask: అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..!
Banana Hair Mask
Follow us on

అరటి పండు.. రుచికరమైన పండు మాత్రమే కాదు, పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా చర్మం, జుట్టు సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. ఇది మన జుట్టుకు అద్భుతమైన పోషణను అందించే సహజమైన ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అరటి పండులో పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అరటిపండు మన జుట్టుకు తేమను అందిస్తుంది. బనానా హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా, పట్టులాగా మెరిసిపోతుంది. అరటిపండులోని నూనెలు జుట్టును లోతుగా మాయిశ్చరైజ్ చేస్తాయి. తద్వారా వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టం నుండి జుట్టును కాపాడుతుంది. అరటిపండులోని పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అరటిపండు జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అరటిపండులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గిస్తాయి. ఇన్నీ ప్రయోజనాలు కలిగిన అరటి హెయిర్‌ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

అరటిపండు హెయిర్ మాస్క్ కోసం కావలసినవి:

– పండిన అరటిపండు – 1

ఇవి కూడా చదవండి

– పెరుగు – 2-3 టేబుల్ స్పూన్లు

– తేనె – 1 టేబుల్ స్పూన్

– కొబ్బరి నూనె – 1 టేబుల్ స్పూన్

– అవకాడో – ¼ భాగం

తయారీ విధానం:

పండిన అరటిపండు తీసుకోవాలి. దాని తొక్క తీసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. అరటిపండు గుజ్జును పెరుగు, తేనె, కొబ్బరి నూనె లేదా అవకాడోతో కలిపి మెత్తని పేస్ట్‌గా తయారు చేసుకోవాలి.. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టు చివర్ల వరకు పట్టించి వేడి టవల్‌తో తలకు చుట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో జుట్టును కడగాలి. తేలికపాటి షాంపూతో కడిగేయవచ్చు.

ఈ మాస్క్‌ని ఉపయోగించే ముందు ఓ సారి టెస్ట్‌ ప్యాక్‌ ట్రై చేయండి..ఏదైనా అలెర్జీ ఉంటే తెలుస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..