కాఫీ ప్రియులకు బ్యాడ్ న్యూస్..! ధరలు విపరీతంగా పెరుగుదల.. కారణం ఏంటో తెలుసా..?

Coffee Lovers : మన దేశంలో కాఫీ ప్రియుల సంఖ్య ఎక్కువే. కొంతమందికి కాఫీ అంటే ప్రాణం. పొద్దున్నే లేవగానే మొదట కాఫీని

కాఫీ ప్రియులకు బ్యాడ్ న్యూస్..! ధరలు విపరీతంగా పెరుగుదల.. కారణం ఏంటో తెలుసా..?
Coffee Lovers

Updated on: May 19, 2021 | 6:48 PM

Coffee Lovers : మన దేశంలో కాఫీ ప్రియుల సంఖ్య ఎక్కువే. కొంతమందికి కాఫీ అంటే ప్రాణం. పొద్దున్నే లేవగానే మొదట కాఫీని టేస్ట్ చేయాల్సిందే. లేదంటే వారి డే స్టార్ట్ అవదు. ఏదో వెలితిగా ఉంటుంది. ఆ రోజంతా అన్ ఈజీగా ఫీల్ అవుతారు. కాఫీ తాగిన తర్వాతే తలనొప్పి తగ్గిపోతుందని ఫీల్ అయ్యే వారూ చాలామందే ఉన్నారు. అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కాఫీ ఎగుమతి చేసే అతిపెద్ద దేశం బ్రెజిల్. ఇప్పుడు అక్కడ కరువు తాండవిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కాఫీ గింజల ధర గణనీయంగా పెరుగుతుందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఏప్రిల్ 30 న ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్లో ఒక కప్పు కాఫీ సగటు ధర 17 శాతం పెరిగి 50 4.50 వద్ద ఉంది. అయితే హై-ఎండ్ కాఫీ వినియోగదారులే ఎక్కువగా నష్టపోతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రెజిల్‌లో కరువు వల్ల చౌకైన బీన్స్ కంటే హై-ఎండ్ కాఫీ ప్రీమియానికి అధికంగా ధరలు పెరిగాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. సుదీర్ఘమైన పొడి వాతావరణం వల్ల కాఫీ పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. వీరితో పాటు చెరుకు రైతులకు కూడా ఇంచుమించు పరిస్థితి ఇలానే ఉంది. వర్షపాతం లేకపోవడంతో బ్రెజిల్‌లో నారింజ పంట ఉత్పత్తి కూడా ఈ ఏడాది 31 శాతం తగ్గింది.

గత ఏడాది కూడా బ్రెజిల్ కాఫీ ఉత్పత్తి పడిపోయింది. ఈసారి సమస్య మరింత తీవ్రంగా ఉంది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం సంభవిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కరోనా దెబ్బకు ప్రజలందరు విలవిలలాడుతున్నారు. కాఫీ పంటలకు తేమ చాలా కీలకం అయితే సరైన సమయంలో పొడి స్పెల్ వస్తుంది. దీంతో రైతులందరు పంట నష్టపోతున్నారు. ప్రస్తుత కరువు పరిస్థితికి అటవీ సంపద నాశనమే అని ఆ దేశ శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు.

Southwest Monsoon : తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్… ముందే పలకరించనున్న నైరుతి..

రాయల్ బెంగాల్ టైగర్ దాడిలో జూ అటెండెంట్ మృతి, అరుణాచల్ ప్రదేశ్ లో విషాదం, ఇదే తొలి ఘటన అంటున్న క్యూరేటర్

Model School Entrance Exam: తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం.. ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష వాయిదా..!