Cholesterol Reduce tips: కిచెన్‌లో ఉండే.. ఈ రెండింటితో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోండిలా..

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, మారిన లైఫ్ స్టైల్ విధానం కారణంగా.. అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్, బీపీ, షుగర్ వంటివి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ అవుతున్నాయి. వీటి బారిన ఒక్కసారి పడ్డారంటే.. బయట పడటం చాలా కష్టం. వీటన్నింటికీ కారణం.. బ్యాడ్ కొలెస్ట్రాల్. రక్తంలో పేరుకుపోతున్న చెడు కొలెస్ట్రాల్ వల్లనే..

Cholesterol Reduce tips: కిచెన్‌లో ఉండే.. ఈ రెండింటితో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోండిలా..
Cholesterol Reduce Tips

Updated on: Jun 01, 2024 | 1:40 PM

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, మారిన లైఫ్ స్టైల్ విధానం కారణంగా.. అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్, బీపీ, షుగర్ వంటివి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ అవుతున్నాయి. వీటి బారిన ఒక్కసారి పడ్డారంటే.. బయట పడటం చాలా కష్టం. వీటన్నింటికీ కారణం.. బ్యాడ్ కొలెస్ట్రాల్. రక్తంలో పేరుకుపోతున్న చెడు కొలెస్ట్రాల్ వల్లనే.. అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకుంటూ ఉండాలి. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గించడంలో కిచెన్‌లో ఉండే ఈ రెండూ చక్కగా పని చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ వేగంగా తగ్గుతాయి. మరి అవేంటే ఇప్పుడు చూద్దాం.

దాల్చిన చెక్క:

ప్రతీ ఇంటి కిచెన్‌లో ఉండే వాటిల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్క అద్భుతమైన ఔషధమనే చెప్పాలి. పలు రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించడంలో దాల్చిన చెక్కని చక్కగా సహాయ పడుతుంది. ఆయుర్వేదంలో కూడా దాల్చిన చెక్కని ఉపయోగించేవారు. కొలెస్ట్రాల్‌ని తగ్గించుకునేందుకు.. దాల్చిన చెక్కను పౌడర్‌గా చేసుకుని స్టోర్ చేసుకోవాలి. రోజూ చిటికెడు దాల్చిన చెక్క తీసుకుంటే చాలా చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం గోరు వెచ్చటి నీటిలో ఈ పౌడర్ మిక్స్ చేసి తాగడం. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ చిటికెడు మంచి తీసుకోకూడదు.

అవిసె గింజలు:

కొలెస్ట్రాల్‌ని తగ్గించే మరో అద్భుతమైన పదార్థం ఫ్లక్స్ సీడ్స్ (అవిసె గింజలు). వీటిని తీసుకుంటే కేవలం కొలెస్ట్రాల్‌ మాత్రమే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఫ్లక్స్ సీడ్స్ చక్కగా సహాయ పడతాయి. అవిసె గింజల్ని మిక్సీలో వేసి పౌడర్‌లా తయారు చేసుకోవాలి. వీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఓ గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా తరచూ చేస్తే.. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం మీకు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..