శరీరం అలసటకు గురైనప్పుడు చెమట పట్టడం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో పరిమితికి మించి శరీరమంతా ఏకధాటిగా నీరు కారిపోతుంటుంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో సెకండరీ హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇలా మీకెప్పుడైనా జరిగిందా? ఐతే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. అవును.. ఇది అనేక వ్యాధులకు కారణం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తి రక్తంలో తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి కానప్పుడు డయాబెటిక్ హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. నిజానికి.. శరీర శక్తికి ప్రధాన వనరు గ్లూకోజ్. శరీరం తగినంత గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేయకపోతే శరీర వ్యవస్థ క్రమక్రమంగా కుంటుపడుతుంది. ఇటువంటి స్థితికి గురైనప్పుడు వివపరీతంగా చెమట పట్టడం వల్ల బట్టలు కూడా తడిసిపోతాయి. ఫలితంగా అలసట, చిరాకు, భ్రమలక గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్టినంతమాత్రాన దాన్ని మధుమేహం పరిగణించాల్సిన అవసరం లేనప్పటికీ ఇతర సమస్యలకు దారితీయొచ్చని నిపుణులు అంటున్నారు.
చెమట పట్టడానికి ప్రధాన కారణాలు.. యాంగ్జైటీ, ఆందోళన, మానసిక ఒత్తిడి, స్పైసీ ఫుడ్స్ అధికంగా తినడం. మెనోపాజ్ దశలో అడుగుపెట్లే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా కూడా మహిళల్లో అధికంగా చెమటలు పడుతుంటాయి. హైపర్ థైరాయిడ్, లుకేమియా, గుండె జబ్బులు వారికి విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఇటువంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.