Honeymoon Places: ఆషాఢంలో టూర్‌కు వెళ్తున్నారా..? కొత్తగా పెళ్లయిన జంటలను ఆకట్టుకునే పర్యాటక ప్రదేశాలు ఏంటంటే..?

|

Jul 12, 2024 | 4:00 PM

పెళ్లయిన మొదటి ఏడాది వచ్చే ఆషాఢ మాసంలో కచ్చితంగా భార్య పుట్టింటికి వెళ్లిపోతుంది. ముఖ్యంగా వ్యవసాయం పనులకు మగవాళ్లు వెళ్లరనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీ తీసుకొచ్చారని పలువురు ప్రవచనకారులు చెబుతూ ఉంటారు. అయితే ఆనవాయితీలకు కచ్చితంగా పాటించే తెలుగు రాష్ట్ర ప్రజలు వ్యవసాయం చేసినా.. చేయకపోయినా కచ్చితంగా ఆషాఢమాసం భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అయితే ఈ నెలలో కొంతమంది హనీమూన్ ప్లాన్ చేస్తూ ఉంటారు.

Honeymoon Places: ఆషాఢంలో టూర్‌కు వెళ్తున్నారా..? కొత్తగా పెళ్లయిన జంటలను ఆకట్టుకునే పర్యాటక ప్రదేశాలు ఏంటంటే..?
Honeymoon Places
Follow us on

ప్రస్తుతం తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యింది. ఈ నెల అంటే కొత్తగా పెళ్లయిన జంటలకు అస్సలు నచ్చదు. పెళ్లయిన మొదటి ఏడాది వచ్చే ఆషాఢ మాసంలో కచ్చితంగా భార్య పుట్టింటికి వెళ్లిపోతుంది. ముఖ్యంగా వ్యవసాయం పనులకు మగవాళ్లు వెళ్లరనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీ తీసుకొచ్చారని పలువురు ప్రవచనకారులు చెబుతూ ఉంటారు. అయితే ఆనవాయితీలకు కచ్చితంగా పాటించే తెలుగు రాష్ట్ర ప్రజలు వ్యవసాయం చేసినా.. చేయకపోయినా కచ్చితంగా ఆషాఢమాసం భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అయితే ఈ నెలలో కొంతమంది హనీమూన్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లయిన జంటలు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మంచి పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

లోనావాలా

మహారాష్ట్రలో సందర్శించడానికి చాలా అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఈ నెలలో మీ భాగస్వామితో కలిసి సందర్శించాలని ప్లాన్ చేస్తే లోనావాలా మిమ్మల్ని అమితంగా ఆకట్టకుంటుంది. లోనావాలా మహారాష్ట్రలోని అందమైన హిల్ స్టేషన్‌గా ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలు జంటలను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక్కడికి వెళ్తే జీవితాంతం గుర్తుంచుకునే మెమోరీలను ఆశ్వాదించవచ్చు. రాజ్మాచి పాయింట్, లయన్స్ పాయింట్, లోనావాలా లేక్ వంటి ప్రదేశాల్లో సేదతీరవచ్చు.

ఉదయపూర్

వర్షాల సమయంలో ఉదయపూర్ అందాలను మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది. ఉదయపూర్ దేశంలోనే అత్యుత్తమ రొమాంటిక్ డెస్టినేషన్‌గా పరిగణిస్తారు. వర్షాకాలంలో ఈ నగరం అందం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. స్థానిక జంటలే కాకుండా విదేశీ జంటలు కూడా ఉదయపూర్‌కు రాచరిక ఆతిథ్యాన్ని ఆస్వాదించడానికి చేరుకుంటారు. ఉదయపూర్‌లో మీరు మీ భాగస్వామితో కలిసి ఫతేసాగర్ లేక్, పిచోలా లేక్, లేక్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్ వంటి శృంగార ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

పచ్మర్హి

మధ్యప్రదేశ్‌లో పచ్మర్హి కొత్తగా పెళ్లయిన జంటలను అమితంగా ఆకట్టుకుంటుంది. వర్షం పడినప్పుడు ఈ ప్రదేశం వేలాది జంటలను ఆకర్షిస్తాయి. ఈ అందమైన హిల్‌స్టేషన్ సరస్సు, జలపాతాలకు కూడా ప్రసిద్ధి చెందింది. పచ్మర్హిలో, బీ ఫాల్, అప్సర విహార్, పాండవ్ గుహ, ప్రియదర్శిని పాయింట్ వంటి ప్రదేశాలను అమితంగా ఆకట్టుకుంటాయి.

కుమరకోమ్

కేరళలోని కుమరకోమ్ దక్షిణ భారతదేశంలోని టాప్ రొమాంటిక్ ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. బ్యాక్ వాటర్స్, రొమాంటిక్ రిసార్ట్‌లు, రుచికరమైన స్థానిక వంటకాలకు ప్రసిద్ధి చెందింది. చాలా మంది జంటలు తమ హనీమూన్ జరుపుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మీరు వెంబనాడ్ సరస్సు, కుమరకోమ్ పక్షుల అభయారణ్యం, కుమరకోమ్ బ్యాక్ వాటర్స్‌ ఆకట్టుకుంటాయి.

ముస్సోరీ

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ ప్రాంతం అందమైన హిల్‌స్టేషన్‌గా ఉంది. వర్షం పడినప్పుడు ఈ ప్రదేశాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ సరస్సులు వాటి అందాలు మరింత రెట్టింపు చేస్తాయి. ముస్సోరీలో మీరు కెంప్టీ ఫాల్స్, గన్ హిల్స్, లేక్ మిస్ట్ వంటి అద్భుతమైన ప్రదేశాలను ఆశ్వాదించవచ్చు. 

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..