Rusk Side Effects: టీతో పాటు రస్క్ తింటున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే!

|

Feb 20, 2024 | 4:00 PM

'రస్క్' అంటే చాలా మందికి తెలుసు. వేడి వేడి టీతో కానీ కాఫీతో కానీ తింటూ ఉంటారు. ఉదయం లేదా సాయంత్రం ఇలా తినడం చాలా మందికి ఇష్టం. ఇదో స్నాక్‌లా ఫీల్ అవుతూ ఉంటారు. దీంతో చిరు ఆకలికి బ్రేక్ పడుతుంది. పిల్లలూ, పెద్దలూ ఇష్ట పడి మరీ ఇలా తింటారు. మీరు కూడా మీ లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు. అలాగే సిజేరియన్ ఆపరేషన్స్‌ చేయించుకున్న వాళ్లకు ఎక్కువగా ఈ రస్క్‌ ప్యాకెట్లనే తీసుకెళ్లి ఇస్తూ ఉంటారు. మార్కెట్లో వీటికి..

Rusk Side Effects: టీతో పాటు రస్క్ తింటున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే!
Rusk Side Effects
Follow us on

‘రస్క్’ అంటే చాలా మందికి తెలుసు. వేడి వేడి టీతో కానీ కాఫీతో కానీ తింటూ ఉంటారు. ఉదయం లేదా సాయంత్రం ఇలా తినడం చాలా మందికి ఇష్టం. ఇదో స్నాక్‌లా ఫీల్ అవుతూ ఉంటారు. దీంతో చిరు ఆకలికి బ్రేక్ పడుతుంది. పిల్లలూ, పెద్దలూ ఇష్ట పడి మరీ ఇలా తింటారు. మీరు కూడా మీ లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు. అలాగే సిజేరియన్ ఆపరేషన్స్‌ చేయించుకున్న వాళ్లకు ఎక్కువగా ఈ రస్క్‌ ప్యాకెట్లనే తీసుకెళ్లి ఇస్తూ ఉంటారు. మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువే. కానీ వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఏంటి షాక్ అవుతున్నారా.. స్వయానా ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. వేడి టీతో పాటు రస్క్‌లు తినకూడదట. మరి రస్కులు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్:

రస్కులు తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. రస్కుల్లో షుగర్, గ్లూటెన్ కలుపుతారు. రుచికరంగా ఉండటం కోసం వీటిని ఎక్కువ మోతాదులో మిక్స్ చేస్తారు. కానీ వీటిని టీలో ముంచుకుని తినడం వల్ల.. గ్యాస్, కడుపులో ఇబ్బందిగా అనిపించడం, ఉబ్బరం, కొంత మందిలో విరేచనాల సమస్య కూడా కనిపిస్తుంది. రస్కులు జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది.

వాపులు – నొప్పుల సమస్యలు:

రస్క్‌ను కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు తీసుకోకుండా ఉండాలి. ఉదరకుహర వ్యాధితో బాధ పడేవారు.. రస్క్‌లు తింటే వాపులు, నొప్పి, విరేచనాలు కలుగుతాయి. శరీరంలో క్యాలరీల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో బరువు పెరిగేందుకు కూడా ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతాయి:

రస్కులు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే ఇవి రుచికరంగా ఉండటం కోసం షుగర్, గ్లూటెన్ వంటి వాటిని మిక్స్ చేస్తారు. అలాగే టీలో కూడా చక్కెర శాతం ఉంటుంది. వీటి వల్ల శరీరంలోని ఇన్సులిన్ లెవెల్స్ ప్రభావితం అవుతాయి. రస్కులను రోజూ తినడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంతే కాకుండా వెయిట్ పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు కూడా వస్తాయి. రస్కులో గ్లూటెన్ ఎక్కువగా ఉండటం వల్ల పేగు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.