Beauty Tips: రోజూ సన్ స్క్రీన్ రాసుకుంటే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!

|

Apr 08, 2024 | 8:59 AM

చర్మం నల్లబడకుండా ఉండేందుకు కొందరు రోజుకు రెండు మూడు సార్లు కూడా సన్‌స్క్రీన్‌ రాసుకుంటారు. అయితే రోజూ సన్‌స్క్రీన్ అప్లై చేయడం ముఖానికి మంచిదేనా..? అనే సందేహం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వార్త మీకోసమే.. ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే లాభనష్టలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Beauty Tips: రోజూ సన్ స్క్రీన్ రాసుకుంటే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!
Sunscreen Benefits
Follow us on

ఎండాకాలం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఉదయం 10గంటలకే సూర్యుడు నడినెత్తిమీదకు చేరుతున్నాడు. ఎండల కారణంగా ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. బయట ఎండ, దుమ్మూ, దూళి చర్మంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. చర్మ సంరక్షణ కోసం చాలా మంది ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తారు. చర్మం నల్లబడకుండా ఉండేందుకు కొందరు రోజుకు రెండు మూడు సార్లు కూడా సన్‌స్క్రీన్‌ రాసుకుంటారు. అయితే రోజూ సన్‌స్క్రీన్ అప్లై చేయడం ముఖానికి మంచిదేనా..? అనే సందేహం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వార్త మీకోసమే.. ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే లాభనష్టలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రోజూ సన్‌స్క్రీన్‌ని అప్లై చేయడం..

సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్ స్క్రీన్లను ఉపయోగిస్తారు. ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మీ ముఖ చర్మానికి చాలా ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. మీరు ఎండలో బయటకు వెళ్ళిన ప్రతిసారీ మీరు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలంటున్నారు ఎందుకంటే సన్‌స్క్రీన్ నేరుగా సూర్యకిరణాలు మీ ముఖానికి చేరకుండా నిరోధిస్తుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. సన్‌స్క్రీన్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, సన్‌స్క్రీన్ చర్మాన్ని టాన్ కాకుండా కాపాడుతుంది. ఇది మాత్రమే కాదు, సన్‌స్క్రీన్ ఎల్లప్పుడూ ముఖాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అయితే ఈ సన్ స్క్రీన్ లు ముడతలు, ప్రారంభ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి కూడా సహాయపడతాయి. చర్మ క్యాన్సర్, వడదెబ్బ వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి

సన్‌స్క్రీన్ అప్లై చేయడానికి సరైన సమయం..

ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ రాసుకోవడం మంచిది. తద్వారా చర్మంలో బాగా కరిగిపోతుంది. మీరు నిరంతరం ఎండలో ఉంటే ప్రతి 2 గంటలకు మీ ముఖానికి సన్‌స్క్రీన్ రాయండి. అంతే కాదు వర్షాకాలంలో కూడా సన్‌స్క్రీన్ చర్మాన్ని రక్షిస్తుంది. ముఖానికి సన్‌స్క్రీన్ అప్లై చేసేటప్పుడు, మెడకు కూడా అప్లై చేయాలని గుర్తుంచుకోండి. అంతేకాదు, దీన్ని మీరు చెవులు, పెదవులు మరియు కనురెప్పలపై కూడా పూయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ముఖం మొత్తం మెరిసిపోతుంది. ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం చర్మాన్ని రక్షించుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం. మీరు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయకపోతే ముఖంపై ముడతలు, నల్ల మచ్చలు ఏర్పడతాయి. కానీ కొంతమందికి సన్‌స్క్రీన్‌కు అలెర్జీ లేదా చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అలాంటి చర్మం కలిగిన వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..