Olive Oil: ఆలివ్ ఆయిల్‌ని ఇలా ఒంటికి రాస్తే.. మీ చర్మం మెరిసిపోతుంది!

|

Nov 22, 2024 | 4:08 PM

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్నే కాకుండా చర్మాన్ని కాపాడటంలో కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. ముఖ్యంగా చలి కాలంలో చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ ఆయిల్ చక్కగా పని చేస్తుంది..

Olive Oil: ఆలివ్ ఆయిల్‌ని ఇలా ఒంటికి రాస్తే.. మీ చర్మం మెరిసిపోతుంది!
Olive Oil
Follow us on

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. చాలా మంది ఆలివ్ ఆయిల్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆలివ్ ఆయిల్ వంటలతో పాటు తీసుకున్నా.. మంచిదే. ఆలివ్ ఆయిల్ చాలా ఖరీదు కాబట్టి.. తక్కువగా ఉపయోగిస్తారు. ఆలివ్‌ ఆయిల్ వల్ల కేవలం ఆరోగ్య సమస్యలే కాకండా అందాన్ని కూడా పెంచడంలో చక్కగా పని చేస్తుంది. ఆయిల్ ఆయిల్ రాయవడం వల్ల ఎలాంటి జుట్టు సమస్యలైనా తగ్గి.. జుట్టు ఒత్తుగా పెరగాల్సిందే. ఇలాంటి ఆయిల్‌ని చర్మానికి రాసుకున్నా మేలే. చర్మ సంరక్షణలో ఆలివ్ ఆయిల్‌ని అనేక ప్రాడెక్ట్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఒక మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. చర్మానికి రాస్తే.. మృదువుగా మారడమే కాకుండా కాంతివంతంగా మారేలా చేస్తుంది. చర్మ సమస్యలన్నీ దూరం చేస్తుంది. అందులోనూ ప్రస్తుతం చలి కాలం కాబట్టి.. చర్మానికి మరింత పోషణ అవసరం. ఆలివ్ ఆయిల్‌లో విటమిన్ ఇతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మరి చర్మానికి ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మొటిమలు కంట్రోల్:

ఆలివ్ ఆయిల్ చర్మంపై రాయడం వల్ల మొటిమలు అనేవి కంట్రోల్ అవుతాయి. మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటంలో ఆయిల్ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. మొటిమల సమస్యతో బాధ పడేవారు ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే చక్కగా పని చేస్తుంది.

స్కిన్ మాయిశ్చరైజ్:

ఆలివ్ ఆయిల్‌లో మాయిశ్చరైజ్ చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే మలినాలను వదిలించి.. స్కిన్‌ని మృదువుగా, హైడ్రేట్ చేస్తుంది. ముడతలు, గీతలు వంటివి పోయి.. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

చర్మం కాంతివంతంగా:

చర్మానికి ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే.. రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. చర్మంలో ఉండే కణాలు యాక్టీవ్‌ అవుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.

స్కిన్ హైడ్రేట్:

చర్మం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. చలి కాలంలో వాతావరణంలోని పరిస్థితులు, వాటర్‌లో మార్పుల కారణంగా చర్మం పొడిబారినట్టు.. జీవం కోల్పోయినట్టు కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల స్కిన్ చక్కగా హైడ్రేట్ అవుతుంది. తేమగా, హైడ్రేట్‌గా కనిపిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.