Ghee for Hair: జుట్టుకు నూనె కాకుండా నెయ్యి రాస్తే ఏం అవుతుందంటే..

|

Jul 16, 2024 | 4:57 PM

నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నెయ్యి గురించి అందరికీ తెలుసు. ప్రతి రోజూ ఒక స్పూన్ నెయ్యి తినడం వల్ల శరీర ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మంది. నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. స్కిన్ ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తుంది. అంతే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలా కూడా ఉన్నాయి. ఇలాంటి నెయ్యిని తలకు అప్లై చేస్తే ఏం జరుగుతుంది? చాలా మందికి ఈ సందేహం వచ్చే..

Ghee for Hair: జుట్టుకు నూనె కాకుండా నెయ్యి రాస్తే ఏం అవుతుందంటే..
Ghee For Hair
Follow us on

నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నెయ్యి గురించి అందరికీ తెలుసు. ప్రతి రోజూ ఒక స్పూన్ నెయ్యి తినడం వల్ల శరీర ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మంది. నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. స్కిన్ ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తుంది. అంతే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలా కూడా ఉన్నాయి. ఇలాంటి నెయ్యిని తలకు అప్లై చేస్తే ఏం జరుగుతుంది? చాలా మందికి ఈ సందేహం వచ్చే ఉంటుంది. తలకు నెయ్యి రాసుకోవడం వల్ల ఏం అవుతుందని! జుట్టు అంటే చాలా మందికి ఇష్టం. అసలు నిజం చెప్పాలంటే జుట్టుతోనే అందం మరింత రెట్టింపు అవుతుంది. అలాంటి జుట్టుకు రసాయనాలు ఉండే ప్రోడెక్ట్స్ కంటే.. మన కిచెన్‌లో లభ్యమయ్యే నెయ్యి రాసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచి పోషణ:

జుట్టుకు నూనె కంటే నెయ్యి రావడం వల్ల ఊహించని బెనిఫిట్స్ ఉన్నాయి. అందమైన జుట్టు కావాలి అనుకునేవారు నెయ్యి రాసుకోవడం చాలా మంచిది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి.

జుట్టు పెరుగుతుంది:

తలకు నెయ్యి రాయడం వల్ల మంచి పోషకాలు అన్నీ అందుతాయి. తలలో రక్త ప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది. దీంతో జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. కాబట్టి జుట్టు చక్కగా పెరుగుతుంది. కుదుళ్లు, చివర్లు కూడా చక్కగా ఉంటాయి. జుట్టు పెరగాలి అనుకునేవారు నెయ్యి రాసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కాంతివంతంగా కనిపిస్తుంది:

జుట్టు ఎంత పొడుగ్గా, ఒత్తుగా ఉన్నా అది కాంతివంతంగా కనిపిస్తేనే.. దాని అందం రెట్టింపు అవుతుంది. జుట్టు నిగనిగలాడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది. తలకు నెయ్యి రాసుకోవడం వల్ల జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. అంతే కాకుండా మెత్తగా కూడా ఉంటుంది.

నెయ్యిని ఎలా రాసుకోవాలి:

నెయ్యి రాస్తున్నాం అంటే సరిపోదు. అది వాడే టెక్నిక్స్ కూడా తెలియాలి. అప్పుడే ప్రయోజనాలన్నీ అందుతాయి. నెయ్యి ముద్దగా ఉన్నప్పుడు రాయకూడదు. డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేసి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. తలపై సున్నితంగా మర్దనా చేయాలి. ఒక గంట తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు ఖచ్చితంగా పొడుగ్గా, ఒత్తుగా అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..