కలబందతో ఈ పదార్థాన్ని మిక్స్‌ చేసి ఫేస్‌ప్యాక్‌ తయారు చేస్తే.. మీ చర్మం మరింత మెరిసిపోతుంది..!

|

Oct 10, 2023 | 2:13 PM

లబందను రాత్రంతా ముఖంపై ఉంచాలి. కొద్ది రోజుల్లో ముఖం మెరిసిపోతుంది. అలోవెరా జెల్‌లో రోజ్ వాటర్ కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకోవచ్చు. ఇది చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత క్రీమ్ లోషన్ అవసరం లేదు. ఈ పేస్ట్‌ని ముఖానికి బాగా పట్టించాలి. కావాలనుకుంటే, ఈ పేస్ట్‌ను రాత్రంతా ముఖంపై ఉంచవచ్చు. ఈ మిశ్రమం ముఖానికి గోల్డెన్ గ్లో ఇస్తుంది.

కలబందతో ఈ పదార్థాన్ని మిక్స్‌ చేసి ఫేస్‌ప్యాక్‌ తయారు చేస్తే.. మీ చర్మం మరింత మెరిసిపోతుంది..!
Follow us on

అలోవెరాను చర్మ సంరక్షణలో అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, బి, సి మరియు ఇ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కలబందను ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. అంతే కాదు చర్మం వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. అంటే వృద్ధాప్య సంకేతాలు చర్మంపై కనిపించకుండా నిరోధిస్తుంది. కలబందను ముఖానికి అప్లై చేయటం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రిపూట అలోవెరా జెల్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం సహజసిద్ధంగా మెరుస్తుంది. అయితే, అలోవెరాను ముఖానికి అప్లై చేయడానికి సరైన విధానం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

కలబందను నేరుగా ముఖంపై అప్లై చేయవచ్చు. దీని కోసం మీరు మీ అరచేతిలో అలోవెరా జెల్‌ను తీసుకొని మీ ముఖానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. కలబందను రాత్రంతా ముఖంపై ఉంచాలి. కొద్ది రోజుల్లో ముఖం మెరిసిపోతుంది. అలోవెరా జెల్‌లో రోజ్ వాటర్ కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకోవచ్చు. ఇది చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత క్రీమ్ లోషన్ అవసరం లేదు.

కలబంద- నారింజ తొక్క:

ఇవి కూడా చదవండి

ముందుగా నారింజ తొక్కను ఎండబెట్టి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్‌ను కలబంద జెల్‌తో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది చర్మంపై మచ్చలను తొలగిస్తుంది. ముడతలను నివారిస్తుంది.

అలోవెరా – తేనె:

ఈ ఫేస్ ప్యాక్ సిద్ధం చేయడానికి , ముందుగా అలోవెరా జెల్‌ను తేనె, కొంత పాలతో కలిపి పేస్ట్‌గా తయారు చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ముఖ్యంగా పొడి చర్మానికి ఈ ఫేస్ ప్యాక్ మంచిది.

ముల్తానీ మట్టి -కలబంద ఫేస్ ప్యాక్:

ఈ ప్యాక్ సిద్ధం చేయడానికి, ముల్తానీ మిట్టిని కలబంద జెల్, నీటితో కలపండి. ఈ ప్యాక్ మొత్తానికి బాగా అప్లై చేయండి. సుమారు 15-20 నిమిషాలు పొడిగా ఉండనివ్వండి. దీని తరువాత, మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి.

అలోవెరా – పసుపు :

చిటికెడు పసుపును కలబందతో కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకుంటే చర్మం మెరిసిపోతుంది. ఈ పేస్ట్‌ని ముఖానికి బాగా పట్టించాలి. కావాలనుకుంటే, ఈ పేస్ట్‌ను రాత్రంతా ముఖంపై ఉంచవచ్చు. ఈ మిశ్రమం ముఖానికి గోల్డెన్ గ్లో ఇస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..