పాలు మన ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తాయి. పాలలోని పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి, తేమను అందిస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మీ చర్మం కూడా నిస్తేజంగా, నిర్జీవంగా మారినట్లయితే ఈ టిప్స్ పాటించండి. చర్మం మళ్లీ మెరుస్తూ కాంతివంతంగా మారేందుకు.. మీరు పాటించే స్కిన్ కేర్ రోటీన్‌లో పాలను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పచ్చి పాలను చర్మానికి వాడితే చర్మానికి చాలా మేలు చేస్తుంది. మీరు పచ్చి పాలను ఉపయోగించి ఈ నాలుగు రకాల ఫేస్ ప్యాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు, ఇది చర్మంపై అప్లై చేస్తే చర్మం ఆరోగ్యంగా, మెరుస్తుంది. కాబట్టి చర్మంపై పాలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో రెండు చెంచాల పచ్చి పాలను తీసుకుని అందులో ఒక పెద్ద చెంచా తేనె, కొంచెం నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమం సహజ బ్లీచ్‌గా పనిచేస్తుంది. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై రాయండి. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.
ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, బాదంపప్పును పచ్చి పాలలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే దీన్ని పేస్ట్‌లా చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
మెరిసే చర్మం కోసం మీరు పచ్చి పాలు, పసుపును కూడా ఉపయోగించవచ్చు. అందుకోసం ఒక గిన్నెలో రెండు మూడు చెంచాల పచ్చి పాలను తీసుకుని అందులో ఒక చెంచా పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ఈ ప్యాక్‌ను తయారు చేయడానికి ఒక గిన్నెలో రెండు చెంచాల పచ్చి పాలను తీసుకొని, అవసరమైన విధంగా మెత్తని అవకాడోను కలుపుకోవాలి. సరిగ్గా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై పూర్తిగా అప్లై చేసుకోవాలి. అది ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..