వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక రకాలైన మార్పులు సంభవిస్తుంటాయి. ఈ మార్పులు కొన్ని సహజమైనవి అయితే, మరికొన్ని జీవనశైలి, ఆహారం కారణంగా సంభవిస్తుంటాయి. వృద్ధాప్యంతో చర్మం నిర్జీవంగా మారుతుంది. చర్మం ముడతలు పడి, సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే జుట్టు తెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను తగ్గించడానికి, వీలైనంత యవ్వనంగా కనిపించడానికి ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.. ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..
పాలకూర, మెంతికూర, ఆవాలు వంటి ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
టొమాటోలు లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతుంది.
బ్లూబెర్రీస్ మెదడు అభివృద్ధికి అవసరమైన ఆంథోసైనిన్‌లను అందిస్తుంది. వయసు పెరగడం వల్ల శరీరంలో కనిపించే క్షీణతను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
వాల్‌నట్‌లు, బాదం, చియా గింజలు వంటి నట్స్, గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
గుడ్డు ప్రోటీన్ పవర్ హౌస్‌గా పిలుస్తారు. ఇందులో (ఒక గుడ్డులో) 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కండరాలు, ఎముకలను బలోపేతం చేయడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం.
నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో, విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. రోజూ తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.