Anjeer Laddu: ఈ చిన్న లడ్డూతో కొండంత ఆరోగ్యం..! శీతాకాలంలో రోజూ ఒక్కటి తిన్నారంటే తిరుగుండదు..
Anjeer Laddu Benefits: అంజీర మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తున్న విషయం తెలిసిందే.. అయితే వీటిని లడ్డూల తయారు చేసుకొని తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో ఈ లడ్డు తినడం వల్ల శరీరం లోపలి నుండి వెచ్చగా ఉంటుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అంజీరా లడ్డును ఎలా తయారు చేసుకోవాలి.. వాటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం పదండి.

శీతాకాలంలో అంజీర్ లడ్డూ మనకు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. ఇది మన శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచేందుకు సహాయపడుతుంది. అలాగే రక్తహీనత , జీర్ణక్రియ , మలబద్ధకం , పేగు ఆరోగ్యం , కండరాల ఆరోగ్యం , బరువు నియంత్రణ , చర్మం, జుట్టు ఆరోగ్యానికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఈ లడ్డును పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు . శీతాకాలంలో ఈ లడ్డూను రోజుకూ ఒకటి తినడం వల్ల ఇది మనల్ని అనేక వ్యాధుల భారీ నుంచి రక్షిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అంజీర్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు
- ఎండిన అంజూర పండ్లు – 1 కప్పు (10 నుండి 15 ముక్కలు)
- తరిగిన ఖర్జూరాలు – 1 కప్పు
- తరిగిన బాదం – ¼ కప్పు
- జీడిపప్పు – ¼ కప్పు
- పిస్తాపప్పులు – 2 టేబుల్ స్పూన్లు
- వాల్‌నట్స్ – 2 టేబుల్ స్పూన్లు
- నెయ్యి – 1 టేబుల్ స్పూన్
- ఏలకుల పొడి – ½ టీస్పూన్
అంజీర్ లడ్డు ఎలా తయారు చేయాలి
- అంజీరా లడ్డూ తయారు చేసేకునేందుకు ముందుగా అంజీర్, ఖర్జూరాలను చిన్న ముక్కలుగా కట్‌చేయండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ వేసి కాసేపు వేయించాలి.
- తరువాత అదే పాన్ లో ముందుగా కట్‌చేసుకున్న అంజీర్ పండ్లు, ఖర్జూర ముక్కలు వేసి 4 నుండి 5 నిమిషాలు అవి మెత్తబడే వరకు ఉడికించాలి. తరువాత తరిగిన డ్రై ఫ్రూట్స్, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి, తర్వాత మీ చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల తయారు చేసుకోండి. మీకు ఇష్టమైతే, ఈ లడ్డులకు కాల్చిన నువ్వులు లేదా గసగసాలు జోడించవచ్చు.
ఎండిన అంజీర్, ఖర్జూరంతో తయారుచేసిన ఈ రుచికరమైన వంటకానికి చక్కెర లేదా బెల్లం అవసరం లేదు. బాదం, జీడిపప్పు, పిస్తాపప్పు, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌తో పాటు అంజీర్, ఖర్జూరం నిజమైన తీపి వీటికి రుచిని తెచ్చిపెడుతుంది. ఈ లడ్డులు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. మీకు తక్షన శక్తిని అందిస్తాయి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందింజబడినవి. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉన్నా.. వీటిని మీరు ఉపయోగించాలనుకున్న.. కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




