Orange: ఆరంజ్‌ తొక్కలు పడేస్తున్నారా.? ఇది తెలిస్తే ఆ పని చేయరు..

అంతేకాకుండా ఇందులోని ఫొలేట్‌, కాల్షియం ఆర్యోగాన్ని కాపాడుతుంది. ఇక రోగ నిరోధకశక్తి పెరగడంలోనూ నారింజ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కేవలం నారిజం పండుతో మాత్రమే కాకుండా తొక్కతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసా.? అవును మనం తేలికగా తీసి పడేసే...

Orange: ఆరంజ్‌ తొక్కలు పడేస్తున్నారా.? ఇది తెలిస్తే ఆ పని చేయరు..
Orange Peel

Updated on: Mar 01, 2024 | 6:06 PM

కాలంతో సంబంధం లేకుండా లభించే పండ్లలో నారిజం ప్రధానమైంది. విటమిన్‌ సీకి పెట్టింది పేరైన ఆరంజ్‌ పండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అంతేకాకుండా ఇందులోని ఫొలేట్‌, కాల్షియం ఆర్యోగాన్ని కాపాడుతుంది. ఇక రోగ నిరోధకశక్తి పెరగడంలోనూ నారింజ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కేవలం నారిజం పండుతో మాత్రమే కాకుండా తొక్కతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసా.? అవును మనం తేలికగా తీసి పడేసే నారింజ తొక్కతో ఆరోగ్యాన్ని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకీ నారింజ తొక్కతో కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఆరెంజ్‌ తొక్క చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జిడ్డు సమస్యతో బాధపడే వారికి ఆరెంజ్‌ తొక్క బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. నారింజ తొక్కలను ఎండబెట్టి, వాటిని మెత్తగా పొడి చేసుకొని.. అందులో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది.

* నిద్రలేమి సమస్యకు కూడా నారింజ తొక్క ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఆరెంజ్‌ తొక్కను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత నీటిని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

* ఆరెంజ్‌ తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నారింజ తొక్కను చక్కెర, నిమ్మకాయతో కలిపి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

* జుట్టు సంరక్షణకు కూడా నారింజ తొక్కలు ఉపయోగపడతాయి. నారిజం తొక్కలతో తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.

* చుండ్రు సమస్యకు కూడా నారింజ తొక్కి బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేసి, దానికి కొబ్బరి నూనె వేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..