
నేటి కాలంలో చిన్న వయసులోనే జుట్టు రాలడం, బట్టతల రావడం సాధారణమై పోయింది. సాధారణంగా పని ఒత్తిడి, పోషకాహాలోపం, నిద్ర లేకపోవడం వల్ల జుట్టు రాలుతుంది. జుట్టు రాలడం ప్రారంభమైన తర్వాత ఇక దానిని నియంత్రించడం బ్రహ్మతరం కూడా కాదు. దీంతో ఆ ప్రాంతంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోవడమే కాకుండా.. తిరిగి పెరగవు. దీనివల్ల కాన్ఫిడెన్స్ లెవల్స్ దెబ్బతింటాయి. కానీ ఈ సమస్యకు పరిష్కారం మీ ఇంటి పెరట్లోనే ఉంది. అదేంటంటే.. కలబంద మొక్క గురించి అందరికీ తెలిసిందే. దీని జెల్ తీసి తలకు అప్లై చేస్తే క్రమంలో జుట్టులేనిచోట కొత్త జుట్టు వస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బట్టతల సమస్య ఉన్నవారికి కలబంద జెల్ ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
కలబందలోని పోషకాలు తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి తలపై చర్మ సమస్యలను, మంటను తగ్గిస్తాయి. కలబంద తల చర్మం సహజ pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కలబందలో యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టు రాలడానికి దారితీసే చుండ్రును నియంత్రించడంలో సహాయపడుతుంది. కలబందలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లు కూడా ఉంటాయి. ఇవి చనిపోయిన చర్మ కణాలను సరిచేసి, మూసుకుపోయిన రంధ్రాలను తెరుస్తాయి. అంతే కాకుండా ఇది జుట్టు కుదుళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కలబంద తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు పోషకాలు, ఆక్సిజన్‌ను అందిస్తుంది.
అలోవెరా జెల్ అప్లై చేసే ముందు.. తల చర్మం శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. అంటే తలపై మురికి, నూనె, ఇతర మలినాలు లేకుండా చూసుకోవాలి. కాబట్టి తలకు తేలికపాటి షాంపూ అప్లై చేసి, గోరువెచ్చని నీటితో కడగాలి. తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్ తీసుకొని నేరుగా తలకు అప్లై చేయాలి. చేతివేళ్లను ఉపయోగించి, వృత్తాకార కదలికలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ జెల్‌ను తలపై కనీసం 30 నిమిషాల పాటు అలాగే ఉంచి మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గంట పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.