కలబంద అందానికే కాదు.. బరువును తగ్గిస్తుందట.. అధ్యాయనాల్లో బయటపడుతున్న విషయాలెంటో తెలుసా..

|

Feb 22, 2021 | 10:09 AM

మన ఇంట్లో ఎలాంటి ఖర్చులు లేకుండా పెరిగెది ఔషద మొక్క కలబంద. సామాన్యంగా కలబంద అందాన్ని మరింత పెంపోందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే

కలబంద అందానికే కాదు.. బరువును తగ్గిస్తుందట.. అధ్యాయనాల్లో బయటపడుతున్న విషయాలెంటో తెలుసా..
Follow us on

Health Benefits Of Alovera: మన ఇంట్లో ఎలాంటి ఖర్చులు లేకుండా పెరిగెది ఔషద మొక్క కలబంద. సామాన్యంగా కలబంద అందాన్ని మరింత పెంపోందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో అధిక వేడిని తగ్గించేందుకు సహయపడుతుంది. అలా కాకుండా బరువు తగ్గడంలోనూ ఈ కలబంద సహయపడుతుందని కొన్ని అధ్యాయనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ కలబందను ఆహారంగా తీసుకునే ముందు వైద్యుల సూచనలు తీసుకోవాలి. మరీ ఆలస్యమెందుకు కలబందతో ప్రయోజనాలెంటో తెలుసుకుందామా.

కలబందతో ప్రయోజనాలు..

☞ కొన్ని సర్వేల ప్రకారం డైట్ ప్లాన్, వ్యాయామానికి కలబందను తీసుకుంటే సులభంగా బరువుత తగ్గుతారట.
☞ ఇందులో ఎక్కువగా ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ ఉంటాయి.
☞ శరీరంలోని వ్యర్థ కొవ్వు కరిగించేందుకు ఇవి సహయపడతాయి.
☞ బాడీ మాస్ ఇండెక్స్‏ను కలబంద తగ్గిస్తుంది.
☞ అంతేకాకుండా అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది.
☞ ఇందులోని ఫైటో స్టెరాల్స్ జీవక్రియ రేటును రెట్టింపు చేయడం వలన శరీరం అధిక కొవ్వును వినియోగించుకోవడం వలన బరువు తగ్గుతారు.

దీనిని ఏలా తీసుకోవాలి..

ఒక కప్పు నీటిలో టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, టేబుల్ స్పూన్ అల్లం రసం తీసుకొని అవిరెండు కలిసిపోయేవరకు కలపాలి. ఆ తర్వాత దాన్ని చిన్న మంట మీద గోరువెచ్చగా వేడి చేయాలి. గోరువెచ్చగా దీనిని తాగితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. యాంటాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే గ్రీన్ టీ బరువును తగ్గిస్తుంది. అంతేకాకుండా మనం రోజూ తీసుకునే గ్రీన్ టీలో కలబంద రసాన్ని కలిపి ఉదయాన్నే ఒకసారి, రాత్రి ఒకసారి తీసుకోవడం వలన క్రమంగా బరువు తగ్గుతారు. అయితే ఇలా చేయడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Also Read:

మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా ? మెరుగైన జ్ఞాపకశక్తి కోసం వీటిని తినాలంటున్న నిపుణులు..