Almond Oil For Hairs : జుట్టు పెరగడం లేదా? రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో తల మసాజ్‌ చేసుకోండి..!

ఇది జుట్టు పెరుగుదలను మరింత పెంచుతుంది. తలలో చుండ్రు, తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తుంది. చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య అందరికీ ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ, అది పరిష్కరించలేని సమస్య కాదు. దీనికి ఆయుర్వేదంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో బాదం నూనె ఒకటి.

Almond Oil For Hairs : జుట్టు పెరగడం లేదా? రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో తల మసాజ్‌ చేసుకోండి..!
Almond Oil For Hairs

Updated on: Mar 26, 2025 | 8:18 PM

పొడవాటి, మెరిసే మందపాటి జుట్టు కావాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన పాత పద్ధతి తలకు రెగ్యూలర్‌గా నూనె పెట్టుకోవడం. తలకు నూనె రాయడం, తరచూ తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను మరింత పెంచుతుంది. తలలో చుండ్రు, తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తుంది. చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య అందరికీ ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ, అది పరిష్కరించలేని సమస్య కాదు. దీనికి ఆయుర్వేదంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో బాదం నూనె ఒకటి.

బాదం నూనెలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు మూలాలకు పోషణనిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మీ జుట్టును మెరిసేలా చేస్తుంది. బాదం నూనెలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు మూలాలకు పోషణనిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మీ జుట్టును మెరిసేలా చేస్తుంది.

తలకు బాదం నూనెను ఉపయోగించే విధానం: బాదం నూనెను ఉపయోగించే ముందు వేడి చేయాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ తలకు నూనె రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. 3-4 గంటల తర్వాత మీ జుట్టును శుభ్రంగా కడగాలి. ఇది జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. జుట్టు చివర్లు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం అవుతుంది. బాదం నూనె, ఆముదం, ఆలివ్‌ నూనెల్ని సమపాళ్లలో తీసుకొని కలపాలి. ఈ మిశ్రమంతో కుదుళ్లను మర్దన చేసుకోవాలి. ఇలా వారంలో కనీసం రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..