ఈ ఐదు రోజూ తిన్నారంటే..ఇక మీ బరువు తేలికే..

మనిషి శరీరానికి ప్రోటీన్‌ల అవశ్యకత అత్యంత ప్రాధాన్యమైనది. పోషకాలు కణంలోని అమైనో ఆసిడ్‌లను విచ్చిన్నం చేసి కణం పెరుగుదల, సమస్య కలిగిన కణ భాగాన్ని సరిచేస్తాయి.మాంసం, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు వంటివి ప్రోటీన్ లను కలిగి ఉన్న ముఖ్య పదార్థాలు. అయితే, వీటి నుండి సాచురేటేడ్‌ ఫ్యాట్‌, కొవ్వు పదార్థాలు అధికంగా కలిగి ఉంటాయి. దీంతో బరువు పెరిగే సమస్యతో పాటు మరిన్ని సైడ్‌ఎఫెక్ట్స్ కు దారితీసే అవకాశం లేకపోలేదు. కానీ, బరువును నియంత్రిస్తూ..అధిక ప్రోటీన్లను […]

ఈ ఐదు రోజూ తిన్నారంటే..ఇక మీ బరువు తేలికే..
Follow us

|

Updated on: Sep 13, 2019 | 5:27 PM

మనిషి శరీరానికి ప్రోటీన్‌ల అవశ్యకత అత్యంత ప్రాధాన్యమైనది. పోషకాలు కణంలోని అమైనో ఆసిడ్‌లను విచ్చిన్నం చేసి కణం పెరుగుదల, సమస్య కలిగిన కణ భాగాన్ని సరిచేస్తాయి.మాంసం, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు వంటివి ప్రోటీన్ లను కలిగి ఉన్న ముఖ్య పదార్థాలు. అయితే, వీటి నుండి సాచురేటేడ్‌ ఫ్యాట్‌, కొవ్వు పదార్థాలు అధికంగా కలిగి ఉంటాయి. దీంతో బరువు పెరిగే సమస్యతో పాటు మరిన్ని సైడ్‌ఎఫెక్ట్స్ కు దారితీసే అవకాశం లేకపోలేదు. కానీ, బరువును నియంత్రిస్తూ..అధిక ప్రోటీన్లను అందించగల ఐదు ముఖ్య పదార్థాలను ఓసారి పరిశీలిద్దాం..

1. అవిసె గింజలు ః * ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ అవిసె గింజలలో పుష్క‌లంగా ఉంటాయి. * వీటిలో పీచు పదార్థం(ఫైబ‌ర్‌) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. * ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. * మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే కాక అందానికి కూడా ఇవి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. * జుట్టుని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి. యాంటీ ఏజింగ్ ల‌క్షణాలు అవిసెల్లో పుష్క‌లంగా ఉన్నాయి. * మెదడుకు శక్తినిస్తాయి. మెద‌డు చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చిన్నారుల‌కు రోజూ అవిసె గింజ‌ల‌ను తినిపిస్తే వారు చ‌దువుల్లో బాగా రాణిస్తారు.

2. వాల్నట్స్‌ ః * రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో వాల్ న‌ట్స్‌ ఔషధంలా పనిచేస్తాయి. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్లు, మినరల్స్ వీటిలో ఉంటాయి. * మధుమేహ వ్యాధిగ్రస్తులకు వాల్ న‌ట్స్‌ బాగా పనికొస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను ఇవి తగ్గిస్తాయి. * రొమ్ము క్యాన్సర్ రాకుండా వాల్ న‌ట్స్‌ కాపాడతాయి. * గుండె, దాని సంబంధ వ్యవస్థలను ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి. బీపీ కూడా అదుపులోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.  రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. * గర్భిణీ మహిళలు వాల్ న‌ట్స్‌ను రోజూ తీసుకుంటే పిండం పెరుగుదలకు అది తోడ్పడుతుంది. నెలలు నిండకుండానే జరిగే ప్రసవాన్ని ఇవి అడ్డుకుంటాయి. * బరువు తగ్గుతారు, ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి. వెంట్రుకల పెరుగుదలకు కూడా వాల్ న‌ట్స్‌ పనికొస్తాయి. * ఒత్తిడిని తగ్గించడంలో వాల్ న‌ట్స్‌ అద్భుతంగా పనిచేస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు వీటిని నిత్యం తీసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది.

3. చియా సీడ్స్ (Chia Seeds) ః * మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్ తో పాటు అందాన్ని ఇనుపడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది. * శరీర ఉష్ణోగ్రత సైతం తగ్గించి బౌల్ మూమెంట్ సమస్యను నివారిస్తాయి. * శరీరంలోపల మాత్రమే కాదు, శరీరం బయట భాగాన్ని కూడా కాపాడుటలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి, కొద్దిగా నూనె కలిపి గాయాల మీద అప్లై చేస్తే గాయాలు త్వరగా తగ్గుతాయి. * తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో పోరాడే వారు ఈ విత్తనాలను నీళ్ళలో వేసి అవి ఉబ్బిన తర్వాత ఆ నీటిని తాగితే..తక్షణ ఫలితం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. * శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె నానబెట్టిన సబ్జగింజలు, ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. * గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, లాంటి సమస్యలు బాధిస్తుంటే..ఈ గింజల్ని నీళ్ళలో వేసి నానబెట్టి నేరుగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. * హైబిపితో బాధపడుతున్నట్లైతే వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపి క్రమంగా అదుపులోకి వస్తుంది.

4. గుమ్మడికాయ విత్తనాలు (Pumpkin Seeds) * గుమ్మడికాయ విత్తనాల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, కోలన్ క్యాన్సర్లు రాకుండా ఉంటుంది. * మహిళలు గుమ్మడికాయ విత్తనాలను తరచూ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. * గుమ్మడికాయ విత్తనాలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. * మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. * వీటిల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు చర్మ సౌందర్యాన్ని పదిలంగా ఉంచుతాయి. చర్మాన్ని రక్షిస్తాయి. దీంతో చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కాంతివంతంగా, మృదువుగా కూడా మారుతుంది. * తల వెంట్రుకలు రాలిపోవటం, చిన్నతనంలోనే బట్ట తల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వాటిల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. ఫలితంగా హెయిర్‌ఫాల్ కూడా తగ్గుతుంది.

5. బాదంపప్పుః *ఇవి చాలా రకాల విటమిన్లను కలిగి ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి… స్లిమ్‌గా       తయారవుతాం. * శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేస్తుంది. * జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, ధ్రుడంగా పెంచే మెగ్నీషియం, జింక్ వంటివీ, విటమిన్ E బాదంలలో ఉంటాయి. అలాగే… జుట్టును ఎక్కువ కాలం నిలిచివుండేలా చేసే విటమిన్ B… బాదంపప్పుల్లో ఉంటుంది. * బాదంలలో యాంటీఆక్సిడెంట్స్, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వును తరిమికొడతాయి. ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది. * జుట్టు తెల్లబడిపోవడం, చర్మంపై ముడతల వంటివి వస్తుంటే… మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాల్సిందే. ఎందుకంటే… వాటిలోని మాంగనీస్… కొల్లాజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. ఇక విటమిన్ E చర్మాన్ని కాపాడటమే పనిగా పెట్టుకుంటుంది. అందువల్ల రోజూ బాదం పప్పులు తినేవాళ్లకు త్వరగా ముసలితనం రాదు.

ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!