Lifestyle: స్పైసీగా తినాలనిపించడానికి.. అసలు కారణం ఏంటో తెలుసా.?

|

Apr 26, 2024 | 7:13 AM

బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళ్తాం.. మసాలా ఎక్కువగా ఇవ్వమని ఆర్డర్‌ చేస్తాం. అలాగే ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కి వెళ్లినప్పుడు కాస్త స్పైసీగా చెయ్యు భయ్యా అంటూ చెబుతుంటాం. ఇలా మనలో చాలా మంది కారం ఎక్కువగా తినడానికి ఆసక్తిచూపిస్తుంటారు. స్వీట్స్‌ను ఎంతలా ఇష్టపడి తింటుంటామో అలాగే కారాన్ని కూడా అంతే ఇష్టంగా తింటుంటాం...

Lifestyle: స్పైసీగా తినాలనిపించడానికి.. అసలు కారణం ఏంటో తెలుసా.?
Spicy Food
Follow us on

బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళ్తాం.. మసాలా ఎక్కువగా ఇవ్వమని ఆర్డర్‌ చేస్తాం. అలాగే ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కి వెళ్లినప్పుడు కాస్త స్పైసీగా చెయ్యు భయ్యా అంటూ చెబుతుంటాం. ఇలా మనలో చాలా మంది కారం ఎక్కువగా తినడానికి ఆసక్తిచూపిస్తుంటారు. స్వీట్స్‌ను ఎంతలా ఇష్టపడి తింటుంటామో అలాగే కారాన్ని కూడా అంతే ఇష్టంగా తింటుంటాం. అయితే కారం ఎక్కువగా తినాలనిపించడానికి వెనకాల కొన్ని రకాల కారణాలు ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ మనకు కారాన్ని తినాలని చెప్పడానికి ఎందుకు ప్రేరేపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్న సమయాల్లో కారం, మసాలా ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. మనలో చాలా మంది ఇలాంటి అనుభూతిని ఎదుర్కొనే ఉంటారు. కారంగా ఉండే ఆహారాల్లో క్యాప్సైసిన్‌ ఉంటుంది. ఇది శరీరంలో వెచ్చదనం అనుభూతిని ప్రోత్సహిస్తుంది. దీంతో చలికాలంలో ఎక్కువగా స్పైసీ ఫుడ్‌ తీసుకోవాలని ఆశపడుతుంటారు.

* ఇక గర్భిణీలు సైతం స్పైసీగా ఉండే ఫుడ్‌ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఈ సమయంలో వీరి శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే. హార్మోన్ల మార్పుల కారణంగా కారం మసాలాలు ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. కానీ గర్భిణీల్లో ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* డిప్రెషన్‌తో బాధపడుతున్న సమయంలో కూడా ఎక్కువగా కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణంగా కారంగా ఉండే ఆహారం యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. నిరాశ తేలికపాటి లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే ఆ ఫుడ్‌కు ఆకర్షితులవుతారు.

* మిరపకాయలను ఎక్కువగా తినే వారికి కూడా కాలక్రమేణా స్పైసీ ఫుడ్ తినాలనిపించే ఇష్టం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చిలో కనిపించే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం వల్ల స్పైసీ ఫుడ్ పై కోరికలు ఏర్పడతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలు అధ్యయనాల్లో వెల్లడైన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..