కెరీర్‌లో స్థిరపడ్డ తర్వాతే పిల్లల్ని కనాలని కొందరు, పెళ్లికాక ముందే సహజీవనం చేసే వారు మరికొందరు.. ఇలా కారణం ఏదైనా కండోమ్‌లు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కండోమ్ వినియోగంపై ప్రచారాలు చేపట్టేవి. శృంగార సంబంధిత వ్యాధులు దరిచేరకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రచారాలు చేపట్టేవి. అయితే ప్రస్తుతం అలాంటి ప్రచారం ఏది లేకపోయినా దేశంలో కండోమ్స్ వినియోగం భారీగా పెరిగినట్లు తాజా గణంకాలు చెబుతున్నాయి. ఎంతలా అంటే అత్యధికంగా కండోమ్స్ ఉపయోగిస్తున్న దేశాల్లో భారత్ ఏకంగా రెండో స్థానంలో నిలిచే అంతలా. అవును మీరు చదివింది నిజమే కండోమ్స్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
ప్రముఖ ట్రెడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ సంస్థ స్టాక్‌గ్రో చేపట్టిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2026 నాటికి భారత్‌లో కండోమ్స్ మార్కెట్ విలువ 134 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం భారత్‌లో కండోమ్స్ మార్కెట్‌లో మ్యాన్‌ఫోర్స్ ఇండియా అధిక భాగాన్ని అక్రమించినట్లు తెలిపింది. యువతలో అత్యంత ప్రాచుర్యం పొందిన గర్భనిరోధక పద్ధతి కండోమ్ కావడంతో.. భారత్‌లో కండోమ్ సంస్థలకు భారీ ఆదాయ వృద్ధికి ఇది దారి తీస్తుందని స్టాక్‌గ్రో అభిప్రాయపడింది.
India is the world’s 2nd largest consumer of #condoms ?
This market could grow to $134 Mn by 2026 and @ManforceIndia is leading this market share race.
Condoms are youth’s most popular contraceptive method. Can this lead to huge revenue growth for India’s top manufacturers?? pic.twitter.com/gONawu6fsG
— StockGro (@stockgro) March 28, 2023
భారత్‌లో ప్రతీ ఏటా ఏకంగా 2 బిలియన్ల కండోమ్స్ అమ్ముడుపోతునట్లు ఈ సర్వేలో తేలింది. వీటిలో కేవలం 8.9 శాతం మంది పెళ్లైన మహిళలు, 10.3 శాతం పెళ్లైన పురుషులు కండోమ్స్‌ను వినియోగిస్తున్నారు. మిగతా వాటా మొత్తం పెళ్లి కానీ జంటలతో కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఓ సర్వే ప్రకారం గడిచిన దశాబ్దకాలంగా పెళ్లికాని అమ్మాయిల్లో కండోమ్స్ వినియోగం ఆరురెట్లు పెరిగినట్టు తేలింది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..