Heart Attack: ఉప్పే కాదు.. అది కూడా గుండెకు చేటే, పరిశోధనల్లో సంచలన విషయాలు..

|

Feb 18, 2024 | 6:57 AM

ఇదిలా ఉంటే గుండె పోటుకు ప్రధాన కారణాల్లో శారీరకశ్రమ లేకపోవడం ఒకటైతే. ఉప్పు, అనారోగ్య కొవ్వులు ఎక్కువగా తీసుకోవడమే ప్రధాన కారణంగా చెబుతుంటారు. ఉప్పు అధికంగా తీసుకునే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే వీలైనంత వరకు ఉప్పును...

Heart Attack: ఉప్పే కాదు.. అది కూడా గుండెకు చేటే, పరిశోధనల్లో సంచలన విషయాలు..
Heart Health
Follow us on

ఇటీవలి కాలంలో హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా భారత దేశంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువుతోందని గణంకాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి ఇది మరింత ఎక్కువైందని చెప్పాలి. చిన్న వయసులో ఉన్న వారు సైతం గుండెపోటుతో మరణిస్తుండడం అందిరనీ షాక్‌కి గురి చేస్తోంది.

ఇదిలా ఉంటే గుండె పోటుకు ప్రధాన కారణాల్లో శారీరకశ్రమ లేకపోవడం ఒకటైతే. ఉప్పు, అనారోగ్య కొవ్వులు ఎక్కువగా తీసుకోవడమే ప్రధాన కారణంగా చెబుతుంటారు. ఉప్పు అధికంగా తీసుకునే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే వీలైనంత వరకు ఉప్పును తగ్గించాలని సూచిస్తుంటారు. అయితే కేవలం ఉప్పు మాత్రమే కాదు, చక్కెర కూడా గుండెకు చేటు చేస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

షుగర్‌ అధికంగా ఉన్న ఆహారం.. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ విషయమై క్లేటన్‌ క్రూగర్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘అధిక ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల గుండె, మూత్రపిండాల్లోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. ఇది గుండె సమస్యలకు, పక్షవాతానికి దారితీయవచ్చు. గుండె రక్తనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల థ్రాంబస్‌ లేదా రక్తగడ్డలు ఏర్పడవచ్చు. ఫలితంగా గుండెలోని భాగాలకు ఆక్సిజన్‌, పోషకాలు అందని పరిస్థితి వస్తుంది. ఇది దీర్ఘకాల ఇన్‌ఫ్లమేషన్‌.. గుండె వైఫల్యానికీ దారితీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో శరీరానికి సరిపడినంత రక్తాన్ని ఆ అవయవం పంప్‌ చేయదు’ అని చెప్పుకొచ్చారు.

ఇక అధికంగా చెక్కర తీసుకుంటే.. ఊబకాయం, టైప్‌-2 డయాబెటిస్‌కు కారణమవుతుందని క్లేటన్‌ పేర్కొన్నారు. దీంతో హృద్రోగాలు, పక్షవాతం, నాడులు దెబ్బతినడం, మూత్రపిండాల వైఫల్యం, చూపు, వినికిడి సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే పండ్ల, కూరగాయల్లో ఉండే నేచురల్‌ చక్కెరలు శరీరంపై పెద్దగా ప్రభావం చూపయని పరిశోధకులు చెబుతున్నారు. రిఫైన్డ్‌ చక్కెరలాగా ఇవి రక్తంలో షుగర్‌ స్థాయిని పెంచవని చెప్పుకొచ్చారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..