Sleep Disorders: నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారా..! ఈ జ్యూస్‌ తాగారంటే కమ్ముకొస్తుంది..

|

Nov 02, 2021 | 4:06 PM

Sleep Disorders: ఉరుకుల పరుగుల జీవితంలో ఇప్పుడు చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అర్దరాత్రి దాటినా వారికి నిద్ర పట్టదు. దీనివల్ల చాలా

Sleep Disorders: నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారా..! ఈ జ్యూస్‌ తాగారంటే కమ్ముకొస్తుంది..
Sleep Disorders
Follow us on

Sleep Disorders: ఉరుకుల పరుగుల జీవితంలో ఇప్పుడు చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అర్దరాత్రి దాటినా వారికి నిద్ర పట్టదు. దీనివల్ల చాలా రోగాలు అటాక్ అవుతున్నాయి. ఉదయాన్నే ఏ పనిపైనా ఆసక్తి ఉండదు. రాత్రి నిద్రలేని కారణంగా పగలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. అయితే నిద్రలేమికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఎలక్ట్రానిక్‌ వస్తువులు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఇలా నిద్ర సమస్యలు ఎదుర్కొనేవారికి చక్కటి పరిష్కారం ఉంది. అదేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

తాజా పరిశోధనల ప్రకారం.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ద్రాక్షలను జ్యూస్ రూపంలో లేదా పండ్ల రూపంలో తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని తెలియజేస్తున్నారు. నిద్రకు సహకరించే మెలటోనిన్ అనే హార్మోన్ ద్రాక్షలలో పుష్కలంగా ఉంటుంది. కనుక పడుకోవడానికి అరగంట ముందు ద్రాక్షను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఎంతో హాయిగా నిద్ర పడుతుందని నివేదికలు చెబుతున్నాయి.

అలాగే రాత్రిపూట గోరు వెచ్చని పాలు తాగితే కొంతమందికి నిద్ర పడుతుంది. మరికొంతమందికి మంచి పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకుంటారు. అంతేకాకుండా పాలకూరను కూడా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు చెర్రీ పండ్లను నిద్రపోవడానికి ఉపకరిస్తాయి. ప్రతిరోజు రాత్రి ఏడు గంటలలోపు భోజనం చేస్తే సమయానికి నిద్రపోవచ్చు. ఆలస్యంగా భోజనం చేస్తే అది నిద్రపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఉదయం లేవడం కూడా కష్టమవుతుంది.

AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల మూడు రోజులు ఏపీకి భారీ వర్ష సూచన..

Himachal Bypoll Results: బీజేపీకి భారీ షాక్.. హిమాచల్ ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్..

Winter Food Tips: శీతాకాలంలో ఈ ఆహార పదార్ధాలకు, పానీయాలకు దూరంగా ఉండండి. హెల్దీగా ప్రకృతిని ఎంజాయ్ చేయండి