Fever: వైరల్ ఫీవరా.. మీ ఇంటి వంట గదిలోనే మెడిసిన్ ఉంది..

వాతావరణంలో మార్పులు ఉంటే.. సహజంగానే వైరల్‌ ఫీవర్లు ఎక్కువగా వస్తుంటాయి. వైరల్ ఫీవర్ వస్తే.. ఒళ్లు నొప్పులు, ముఖం ఉబ్బినట్లు కావడం, విరోచనాలు, పొట్టలో నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ వైరల్‌ ఫీవర్లు యాంటీ బయోటిక్స్‌కి త్వరగా రెస్పాండ్‌ కావు. ఇంట్లో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సమస్య మరింత తొందరగా తగ్గే అవకాశాలుంటాయి.

Fever: వైరల్ ఫీవరా.. మీ ఇంటి వంట గదిలోనే మెడిసిన్ ఉంది..
Home Remedies

Updated on: Mar 02, 2024 | 12:33 PM

ఆరోగ్యం బాగుంటే ఆ రోజు అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. మన శరీరంలో కొంచెం తేడా వచ్చినా.. ఆ ప్రభావం మన పనులపై పడుతుంది. ముఖ్యంగా జ్వరం వచ్చే రెండు, మూడు రోజుల ముందు నుంచే లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఏది పడితే అది తిన్నా.. కాస్త అజాగ్రత్తగా ఉన్నా డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రజంట్ ప్లూ జ్వరాలు వెంటాడుతున్నాయి. ఈ ఫీవర్స్ వస్తే.. ఒళ్లంతా హూనం అవుతుంది. కోలుకోవడానికి కనీసం వారం పడుతుంది. ఇలా జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలనిపించలేదు. పడుకున్నా నిద్ర పట్టదు. చికిత్స తీసుకోకపోతే.. పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో ఇంట్లోనే చికిత్స పొందడం జ్వరానికి చెక్ పెట్టవచ్చు.

  • ఒక గ్లాసు వేడినీళ్లలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఐదు నిమిషాల తర్వాత వడకట్టి ఈ నీటిని తాగితే జ్వరం తగ్గుతుంది.
  • తులసిలో మిరియాలు నూరి తింటే జ్వరం తగ్గుతుంది.
  • నల్ల మిరియాల పొడి, తేనెను తులసి ఆకుల రసంతో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే స్వాంతన ఉంటుంది
  •  అల్లం రసంలో తేనె కలిపి నాలుకపై రాసుకుంటే జ్వరం తగ్గుతుంది.
  • మిరియాల గింజల కషాయాన్ని తయారు చేసి, అందులో తేనె కలిపి రోజూ సేవిస్తే జ్వరం తగ్గుతుంది.
  • ఎండు వేప చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించి ఈ నీటిని రోజూ తాగితే జ్వరానికి మంచి ఔషధం.
  • తులసి ఆకులను, అల్లం తురుమును ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించి అందులో తేనె కలిపి రోజుకు రెండు మూడు సార్లు సేవిస్తే జ్వరం నుండి ఉపశమనం కలుగుతుంది.
  • ఎండు ద్రాక్షను కొద్ది మొత్తంలో తీసుకుని నీళ్లలో నానబెట్టి వాటి నుండి రసాన్ని పిండుకుని నెయ్యిలో కలుపుకుని రోజుకు రెండు పూటలా సేవించడం మంచిది.
  • వెల్లుల్లి రెబ్బను పొట్టు తీసి చూర్ణం చేసి, కొంత సమయం తర్వాత వేడి నీళ్లలో కలిపి వడగట్టి రోజుకు మూడుసార్లు తాగితే జ్వరం తగ్గుతుంది.
  • ఒక కప్పు వేడి నీళ్లలో పచ్చి అల్లం చూర్ణం కలిపి, కాసేపు అలాగే ఉంచి ఆ అల్లం నీటిలో తేనె కలుపుకుని రోజుకు మూడుసార్లు తాగితే జ్వరం తగ్గుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..