AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaked Raisins: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండు ద్రాక్ష తిన్నారంటే.. ఆ సమస్యలన్నీ పరార్‌!

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మంచిది. నీరసం, నిస్సత్తువలను తగ్గించి తక్షణ శక్తిని ఇస్తుంది. వీటిల్లో తక్కువ కేలరీలు ఉన్నందున ఊబకాయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఎండుద్రాక్షలో తక్కువ కేలరీలు ఉన్నందున ఇవి ఊబకాయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, సి-విటమిన్‌, తక్కువ సోడియం, అధిక పొటాషియం రక్తపోటును క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడతాయి..

Srilakshmi C
|

Updated on: Mar 02, 2024 | 12:13 PM

Share
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మంచిది. నీరసం, నిస్సత్తువలను తగ్గించి తక్షణ శక్తిని ఇస్తుంది. వీటిల్లో తక్కువ కేలరీలు ఉన్నందున ఊబకాయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఎండుద్రాక్షలో తక్కువ కేలరీలు ఉన్నందున ఇవి ఊబకాయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, సి-విటమిన్‌, తక్కువ సోడియం, అధిక పొటాషియం రక్తపోటును క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడతాయి.

1 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టడం వల్ల వాటి నాణ్యత మరింత మెరుగుపడుతుంది. ఫలితంగా, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాల పరిమాణం కూడా పెరుగుతుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని పీచు పదార్ధం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి 2 నుంచి 4 ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో తింటే సరి.

2 / 5
అంతేకాకుండా ఎండుద్రాక్షలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి రోజూ కనీసం 5 నుంచి 6 ఎండు ద్రాక్షలు తినడం అలవాటు చేసుకోవాలి. వీటిని తినడం వల్ల ఎలాంటి బాక్టీరియా ఇన్ఫెక్షన్‌ దరిచేరకుండా నివారిస్తుంది.

3 / 5
ఎముకలను దృఢంగా ఉంచడంలో ఎండుద్రాక్ష చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, ఎండుద్రాక్షలో కాల్షియం పుస్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. వీటిల్లోని విటమిన్‌, ఎ-కెరొటెనాయిడ్‌, బీటా కెరొటెన్‌లు కంటిచూపును మెరుగుపరుస్తాయి.

4 / 5
ఫైబర్ అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉండే ఎండుద్రాక్ష శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తొలగిస్తుంది. అంతేకాదు ఎండుద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

5 / 5