ఈ 5 బ్లాక్ ఫుడ్స్‌ను చీప్‌గా చూడకండి.. కొలెస్ట్రాల్‌కు పవర్‌ఫుల్ బ్రహ్మాస్త్రం.. దెబ్బకు కోసి తీసినట్లే..

ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది.. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల ఊబకాయంతోపాటు బీపీ, గుండె సమస్యల బారిన పడే అవకాశం ఉంది.. అయితే.. LDL కొలెస్ట్రాల్‌ను కొన్ని ఆహారాల సహాయంతో సులభంగా నియంత్రించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 5 నల్ల ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

ఈ 5 బ్లాక్ ఫుడ్స్‌ను చీప్‌గా చూడకండి.. కొలెస్ట్రాల్‌కు పవర్‌ఫుల్ బ్రహ్మాస్త్రం.. దెబ్బకు కోసి తీసినట్లే..
Black Foods

Updated on: May 15, 2025 | 4:29 PM

ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది.. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల ఊబకాయంతోపాటు బీపీ, గుండె సమస్యల బారిన పడే అవకాశం ఉంది.. అంతేకాకుండా హై కొలెస్ట్రాల్ వల్ల పలు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వాస్తవానికి మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్ చాలా ముఖ్యం.. ఇది ఆరోగ్యకరమైన కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. కానీ, చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే.. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

LDL కొలెస్ట్రాల్ సహజంగా రక్తంలో ఉంటుంది. కానీ దాని పరిమాణంలో పెరుగుదల ఆందోళన కలిగించే విషయం. అధిక స్థాయి LDL కొలెస్ట్రాల్ పెరిగితే.. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. రాత్రిపూట అధిక అలసట, బలహీనత, ఛాతీ నొప్పి, చేతులు, కాళ్ళలో జలదరింపు, కండరాల నొప్పి, తిమ్మిరి, కళ్ళ దగ్గర పసుపు కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

LDL కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, తప్పుడు ఆహారపు అలవాట్లు. మీరు దానిని సకాలంలో నియంత్రించకపోతే, గుండెపోటు, స్ట్రోక్ కారణంగా అకాల మరణం సంభవించే ప్రమాదం పెరుగుతుంది.

అయితే.. LDL కొలెస్ట్రాల్‌ను కొన్ని ఆహారాల సహాయంతో సులభంగా నియంత్రించవచ్చు. అటువంటి పరిస్థితిలో, కొలెస్ట్రాల్ లక్షణాలను గమనించిన వెంటనే మీరు మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 5 నల్ల ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీరు ధమనులలో ఉన్న మురికి కొవ్వును సులభంగా తొలగించవచ్చు.

కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సూపర్ బ్లాక్ ఫుడ్స్..

బ్లాక్ బీన్స్..

బ్లాక్ బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వాటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా బలపడుతుంది. దీనివల్ల శరీరం సులభంగా నిర్విషీకరణ చెందుతుంది.

బ్లాక్ బెర్రీలు (నేరేడు పండ్లు)..

నేరేడు పండ్లలో విటమిన్ సీ, ఆంథోసైనిన్‌లు ఉంటాయి.. ఇవి ఒక రకమైన యాంటీఆక్సిడెంట్. బ్లాక్‌బెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల LDL కొలెస్ట్రాల్ తగ్గుతుందని, రక్తపోటును కూడా నియంత్రిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

నల్ల నువ్వులు..

నల్ల నువ్వులలో ఉండే సెసామోలిన్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. నల్ల నువ్వులు ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

నల్ల ద్రాక్ష..

నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్ ఉంటుంది.. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను నిరోధిస్తుంది. అవి LDL కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. నల్ల ద్రాక్ష రసం తయారు చేసి త్రాగడం లేదా నేరుగా తినడం రెండు కూడా మంచిదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నల్ల బియ్యం

‘బ్లాక్ రైస్’ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. ఈ బ్లాక్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల LDL కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..