Beauty Tips: అందమైన పెదవుల కోసం 5 ఉత్తమ మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..

| Edited By: Phani CH

Aug 22, 2021 | 9:19 AM

Beauty Tips: పెదవులపై ఉండే చర్మం మిగతా భాగాలతో పోలిస్తే చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వాటిని పట్టించుకోకపోతే పొడిబారి పగిలిపోతాయి.

Beauty Tips: అందమైన పెదవుల కోసం 5 ఉత్తమ మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..
Dry Lips
Follow us on

Beauty Tips: పెదవులపై ఉండే చర్మం మిగతా భాగాలతో పోలిస్తే చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వాటిని పట్టించుకోకపోతే పొడిబారి పగిలిపోతాయి. అంతేకాదు చూడటానికి చాలా అగ్లీగా కనిపిస్తాయి. పొడి వాతావరణం వల్ల పెదవులు ఎక్కువగా దెబ్బతింటాయి. డీహైడ్రేషన్ కూడా ఒక సమస్య. అప్పుడప్పుడు రక్తస్రావం కూడా జరుగుతుంటుంది. అయితే ఎల్లప్పుడు మీ పెదవులను అందంగా ఉంచుకోవాలంటే ఈ పద్దతులను పాటించండి.

1. పెట్రోలియం జెల్లీ
ఇది మార్కెట్లో సులభంగా లభిస్తుంది. శీతాకాలంలో ప్రతి ఇంట్లో ఉంటుంది. పురుషులు కూడా దీనిని ఉపయోగించవచ్చు. మీరు ప్రతిరోజు నిద్రపోయేముందు కొద్దిగా తీసుకొని పెదవులకు వర్తించాలి. దీనివల్ల వాటిని హైడ్రేట్ చేయవచ్చు.

2. కొబ్బరి నూనె
కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల కూడా పెదాలను మృదువుగా మార్చుకోవచ్చు. ప్రతి రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె పూసి మెల్లగా మర్దన చేయండి. మంచి ఫలితం ఉంటుంది.

3. SPF 15 ఉన్న లిప్ బామ్‌
సూర్యరశ్మి, కాలుష్యం మన పెదాలను నల్లగా మారుస్తాయి. అలాగని మనం బయటకు రాకుండా ఉండలేం కాదా అందువల్ల SPF 15 ఉన్న లిప్ బామ్‌ను ఎంచుకోండి. ఇది తేమను లాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది. అంతేకాదు సూర్యుని UV కిరణాల నుంచి కాపాడుతుంది.

4. నీరు
పెదవులు పగలకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడం అవసరం. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. మీరు డీహైడ్రేట్ అయితే మీ పెదవులు కూడా తడి ఆరిపోతాయి. అందుకే రోజూ తగినంత నీరు తాగాలి.

5. పొడి పెదవుల కోసం
1 స్పూన్ నెయ్యి
1/2 స్పూన్ దుంప రసం
2 చుక్కలు జోజోబా ఆయిల్
ఈ మూడింటిని కలపాలి. వేళ్లతో నెమ్మదిగా పెదవులపై రుద్దాలి. కనీసం 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తద్వారా మీ పెదవులు మృదువుగా ఉంటాయి. మంచి ఫలితాల కోసం వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

Viral Photos: అందమైన సరస్సుల సొగసు వర్ణించతరమా..! మీరు ఓ లుక్కేయండి..

PM Narendra Modi: కళ్యాణ్‌ సింగ్‌ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ.. మాటల్లో చెప్పలేని బాధ ఉందంటూ ట్వీట్‌..

Kalyan Singh: వివాదాలతో సహవాసం అతడి జీవితం.. వాజ్‌పెయ్‌తో వైరం.. పార్టీ నుంచి బహిష్కరణలు..