
మరో ఏడాది గడిచిపోయింది.. కొత్త ఆశలతో 2026కి స్వాగతం పలికే సమయం వచ్చేసింది. ప్రతి ఏటా న్యూ ఇయర్ రాగానే మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. కానీ వారం తిరగకముందే వాటిని అటకెక్కించేస్తాం. ఈసారి అలా జరగకూడదంటే.. మీ లైఫ్ స్టైల్‌లో చిన్న మార్పులు చేస్తే సరి. ఇంతకీ ఎంటా మార్పులు అంటారా.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనం చేసే అతిపెద్ద తప్పు.. ఒకేసారి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. రేపటి నుండి రోజూ గంట సేపు జిమ్ చేస్తా అనడం కంటే రోజూ 15 నిమిషాలు నడుస్తా అని నిర్ణయించుకోండి. చిన్న లక్ష్యాలు సాధించడం సులభం, ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఉదయం లేవగానే ఫోన్ చూడటం మానేయండి. రోజులో కనీసం ఒక గంట పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. 2026లో మీ మానసిక ప్రశాంతత కోసం ఈ డిజిటల్ డిటాక్స్ చాలా అవసరం. కళ్లకు విశ్రాంతినివ్వండి, ప్రకృతితో సమయం గడపండి.
జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేయలేకపోయినా.. మెల్లగా తగ్గించండి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోండి.
కొత్త ఏడాదిలో సేవింగ్స్ మీద దృష్టి పెట్టండి. అనవసర ఖర్చులు తగ్గించి చిన్న మొత్తంలో అయినా సరే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే భవిష్యత్తులో ఒత్తిడి లేకుండా ఉండగలరు.
రోజూ పడుకునే ముందు ఆ రోజు మీకు జరిగిన మూడు మంచి విషయాలను గుర్తు చేసుకోండి. ఇది మీ మెదడును పాజిటివ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇతరులకు సహాయం చేయడం, చిన్న విషయాలకే సంతోషపడటం అలవాటు చేసుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..