వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ హోదాలో కుర్చీలో కూర్చోని లోక్‌సభను నడిపించారు. లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఆయన గురువారం ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభలో అందుబాటులో లేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఇటీవలే లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమితులైన విషయం విదితమే.