విశాఖ, కర్నూలుపై విషం చిమ్మకండి
టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్వీట్ల అటాక్ చేశారు జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని బాబుని కోరిన ఆయన, రాజకీయంగా చివరి దశలో..
టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్వీట్ల అటాక్ చేశారు జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని బాబుని కోరిన ఆయన, రాజకీయంగా చివరి దశలో ఉన్న చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. విశాఖ, కర్నూలు నగరాలపై విద్వేషం చిమ్మడం మానేయాలని.. టీడీపీ గెలిచిన 23 చోట్ల కూడా చంద్రబాబు పేరు చెబితే ప్రజలు భగ్గుమంటున్నారని విమర్శించారు. ఇకనైనా పైశాచిక ఎత్తుగడలు రచించడం, కుళ్లు, కుతంత్రాలు చేయొద్దని వరుస ట్వీట్లు చేశారు సజ్జల.