వైఎస్ వివేకా హత్యకేసులో మరో కొత్త కోణం

| Edited By:

Mar 20, 2019 | 9:09 AM

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఇప్పటికే వివేకా హత్యకు ఉపయోగించిన వేటకొడవలిని సిట్ స్వాధీనం చేసుకుంది. ఆరు నెలల కిందట పులివెందులలో జరిగిన రంగేశ్వర్ రెడ్డి హత్యా.. వివేకా హత్య ఒకే తరహాలో జరిగాయంటున్నారు పోలీసులు. రంగేశ్వర్ రెడ్డిని వేటకొడవలితో కిరాతకంగా నరికిచంపాడు దిద్దేకుంటా చంద్రశేఖర్ అలియాస్ శేఖర్. రంగేశ్వర్ రెడ్డి శరీరంపై గాయాలు, వివేకా శరీరంపై గాయాలు.. ఒకే విధంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్ వెనక ఎవరు స్కెచ్ […]

వైఎస్ వివేకా హత్యకేసులో మరో కొత్త కోణం
Follow us on

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఇప్పటికే వివేకా హత్యకు ఉపయోగించిన వేటకొడవలిని సిట్ స్వాధీనం చేసుకుంది. ఆరు నెలల కిందట పులివెందులలో జరిగిన రంగేశ్వర్ రెడ్డి హత్యా.. వివేకా హత్య ఒకే తరహాలో జరిగాయంటున్నారు పోలీసులు. రంగేశ్వర్ రెడ్డిని వేటకొడవలితో కిరాతకంగా నరికిచంపాడు దిద్దేకుంటా చంద్రశేఖర్ అలియాస్ శేఖర్. రంగేశ్వర్ రెడ్డి శరీరంపై గాయాలు, వివేకా శరీరంపై గాయాలు.. ఒకే విధంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ మర్డర్ వెనక ఎవరు స్కెచ్ వేశారు..? ఎవరు అమలు చేశారనే దానిపై సిట్ బృందం.. దర్యాప్తు చేస్తోంది. మరోవైపు వివేకా అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి కేంద్రంగా సిట్ విచారణ జరుగుతోంది. పరమేశ్వర్ రెడ్డి, గంగిరెడ్డి సైలెంట్ గేమ్ ఆడినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. మరోవైపు.. వివేకా హత్య కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సిట్ విచారణతో వాస్తవాలు బయటకు రావని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పిటిషన్‌లో కోరారు జగన్.