చంద్రబాబు గారూ..! రామ్‌గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?
విజయవాడలో ఓ సినిమా యూనిట్ వచ్చి ప్రెస్‌మీట్ పెట్టుకునే వీలులేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పోలీసుల్ని బంట్రోతుల కంటే హీనంగా వాడుకునే పరిస్థితులు ఉన్నాయంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇదేనా మన ప్రజాస్వామ్యం..? చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్‌గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..? అని ప్రశ్నించారు జగన్. తాజాగా.. ఆదివారం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై విజయవాడ ఎయిర్‌పోర్టులో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ హంగామా సృష్టించారు. ఎట్టకేలకు ఏపీలో లక్ష్మీస్ […]
విజయవాడలో ఓ సినిమా యూనిట్ వచ్చి ప్రెస్‌మీట్ పెట్టుకునే వీలులేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పోలీసుల్ని బంట్రోతుల కంటే హీనంగా వాడుకునే పరిస్థితులు ఉన్నాయంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇదేనా మన ప్రజాస్వామ్యం..? చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్‌గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..? అని ప్రశ్నించారు జగన్.
తాజాగా.. ఆదివారం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై విజయవాడ ఎయిర్‌పోర్టులో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ హంగామా సృష్టించారు. ఎట్టకేలకు ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ సినిమా కార్యక్రమాలకు సంబంధించి వర్మ ఏపీకి వస్తుండగా ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్న విషయం విదితమే. ఈ విషయంపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2019