జగన్‌పై దాడి కేసు.. శ్రీనివాస్‌కి ఏమైంది..?

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఉన్న శ్రీనివాస రావుకు వైరల్ ఫీవర్ సోకడంతో జైలు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అయినా ఫలితం లేక పోవడంతో సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారులు గోప్యంగా ఉంచారు. ఆస్పత్రిలోని ఖైదీల వార్డులో డాక్టర్ నాయక్ పర్యవేక్షణలో అత్యవసర […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:16 pm, Wed, 24 April 19
జగన్‌పై దాడి కేసు.. శ్రీనివాస్‌కి ఏమైంది..?

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఉన్న శ్రీనివాస రావుకు వైరల్ ఫీవర్ సోకడంతో జైలు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అయినా ఫలితం లేక పోవడంతో సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారులు గోప్యంగా ఉంచారు. ఆస్పత్రిలోని ఖైదీల వార్డులో డాక్టర్ నాయక్ పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆస్పత్రిలో శ్రీనివాస్‌ని అతని బంధువులు పరామర్శించారు.