ఛత్తీస్గఢ్ సీఎం అధికారిక నివాసం ముందు ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. జాబ్ ఇప్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించేందుకు వెళ్లిన యువకుడు.. సీఎం ఆఫీస్ సెక్యూరిటీ అడ్డుకోవడంతో నిప్పంటించుకున్నాడు. వెంటనే అలర్టైన సిబ్బంది.. దుప్పట్లు, నీళ్లతో మంటలను ఆర్పి… అనంతరం హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడికి శరీరంలోని చాలా శాతం కాలిపోయిందని తెలుస్తోంది.
దంతరీ ప్రాంతానికి చెందిన హర్దేవ్ ఇంటర్ కంప్లీట్ చేసి.. ఖాళీగా ఉంటూ.. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు సీఎంను కలిసి జాబ్ కోరాలని అనుకున్నట్లు సమాచారం.