AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్బంధంలో సీపీఎం నేత.. సుప్రీంకు సీతారాం ఏచూరి!

జమ్ముకశ్మీర్‌లో గృహనిర్బంధంలో ఉన్న తమ పార్టీ నేత మహ్మద్‌ యూసఫ్‌ తరిగమి విడుదల కోరుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టుకు వెళ్లారు. యూసఫ్‌ను కోర్టులో ప్రవేశపెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడైన యూసఫ్‌ జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలు రాజకీయ పార్టీల నేతలను […]

నిర్బంధంలో సీపీఎం నేత.. సుప్రీంకు సీతారాం ఏచూరి!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 24, 2019 | 7:37 PM

Share

జమ్ముకశ్మీర్‌లో గృహనిర్బంధంలో ఉన్న తమ పార్టీ నేత మహ్మద్‌ యూసఫ్‌ తరిగమి విడుదల కోరుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టుకు వెళ్లారు. యూసఫ్‌ను కోర్టులో ప్రవేశపెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడైన యూసఫ్‌ జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలు రాజకీయ పార్టీల నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచిన విషయం విదితమే. వారిలో యూసఫ్‌ కూడా ఉన్నారు. అయితే నిర్బంధంలో ఉన్న యూసఫ్‌ అనారోగ్యానికి గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యూసఫ్‌ను చూసేందుకు ఏచూరి కశ్మీర్‌ వెళ్లగా.. ఎయిర్‌పోర్టులోనే ఆయనను భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. కశ్మీర్‌లోకి అనుమతించకుండా తిరిగి ఢిల్లీ పంపించారు. దీంతో తమ పార్టీ నేత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఏచూరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూసఫ్‌ను త్వరితగతిన కోర్టు ముందుకు తీసుకొచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

Follow Us
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరు?
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరు?
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి!
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి!
జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు?..
జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు?..
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?