చంద్రబాబుకు ‘ఆ’ వ్యాధి… ట్విట్టర్‌లో రెచ్చిపోయిన విజయసాయి

| Edited By: Srinu

Nov 11, 2019 | 4:48 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి రెచ్చిపోయారు. విపరీత స్థాయిలో మాటల్ని సంధించారు. చంద్రబాబుకు అంతుచిక్కని వ్యాధి వుందంటూ టిడిపి చీఫ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పే మాటలు వింటుంటే ఆయనకు ‘ఆ’ వ్యాధి వుందన్న అనుమానం బలపడుతోందని విజయసాయి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలుగురాష్ట్రాలకు తుఫాను ముప్పు వుంది అని వాతావరణ శాఖ చెబితే.. అది ఎక్కడ తీరం […]

చంద్రబాబుకు ‘ఆ’ వ్యాధి... ట్విట్టర్‌లో రెచ్చిపోయిన విజయసాయి
Follow us on

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి రెచ్చిపోయారు. విపరీత స్థాయిలో మాటల్ని సంధించారు. చంద్రబాబుకు అంతుచిక్కని వ్యాధి వుందంటూ టిడిపి చీఫ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు చెప్పే మాటలు వింటుంటే ఆయనకు ‘ఆ’ వ్యాధి వుందన్న అనుమానం బలపడుతోందని విజయసాయి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలుగురాష్ట్రాలకు తుఫాను ముప్పు వుంది అని వాతావరణ శాఖ చెబితే.. అది ఎక్కడ తీరం దాటుతుందో నాకు ముందే తెలుసని చంద్రబాబు అంటారని, హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించానని, తాను రచించిన విజన్ 2020ని మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం కాపీ కొట్టారని.. ఇలా చంద్రబాబు చెబుతున్న మాటల్ని చూస్తుంటే ఆయనకు ‘ఆ’ వ్యాధి వుందని నిరూపణ అవుతోందని విజయసాయి అన్నారు.

చంద్రబాబు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారనటానికి ఈ కామెంట్టే ఉదాహరణే అన్నారు. సూడోలాజియా ఫెంటాస్టికా (pseudologia fantas´tica) అనే మానసిక రుగ్మత వల్లే చంద్రబాబు పాపం అలా అయిపోయారని వ్యంగ్యంగా విజయసాయి ట్వీట్ చేశారు. తర్కానికందని కోతలు కోయడమే ఈ వ్యాధి లక్షణమే అని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం ప్రతి విద్యార్థి హక్కు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు సంసిద్దలవ్వాలంటే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అవసరం అని ఆయనన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో మాత్రమే బోధన జరగాలనడం.. ఏపీ విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, వెనుకబడిన వర్గాల వారిని ఇంకా ఎంత కాలం మీ పిల్లలు, మనవళ్లు చదువుకునే ఆంగ్ల మాధ్యమానికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తారు చంద్రబాబూ?’ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారుు విజయసాయి.